Home » రోబో సినిమాలో షారుక్ హీరో గా రజిని విలన్ గా పెట్టి సినిమా తీద్దాం అనుకున్న శంకర్ మళ్ళీ ఎందుకు మార్చేశారంటే ?

రోబో సినిమాలో షారుక్ హీరో గా రజిని విలన్ గా పెట్టి సినిమా తీద్దాం అనుకున్న శంకర్ మళ్ళీ ఎందుకు మార్చేశారంటే ?

by AJAY
Ad

ఇప్పుడంటే సినిమా ఇండ‌స్ట్రీలో రాజ‌మౌళి హ‌వా కనిపిస్తుంది కానీ ఒక‌ప్పుడు శంక‌ర్ హ‌వా న‌డిచేది. శంక‌ర్ ఇండియాలోని టాప్ డైరెక్ట‌ర్ ల‌లో ఒక‌రిగా ఉండేవారు. భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో సౌత్ లో ఆయ‌నే నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉండేవారు. శంక‌ర్ సినిమాలు అంటే కోట్ల బ‌డ్జెట్ తో ఉండేవి. షూటింగ్ కోసం భారీ సెట్ లను వేసేవారు. ఇటీవ‌ల కాలంలో శంక‌ర్ కు స‌రైన హిట్ ప‌డ‌లేదు కానీ ఆయ‌న చేసిన రోబో సినిమా ఓ సెన్సేష‌న్ ను సృష్టించింది. ఈ సినిమాకు మందు చాలా క‌థ జ‌రిగింది.

 

Advertisement

శంక‌ర్ తెర‌కెక్కించిన ఒకే ఒక్క‌డు సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఈ సినిమాకు రీమేక్ గా శంక‌ర్ బాలీవుడ్ లో నాయ‌క్ అనే సినిమాను తెర‌కెక్కిచాడు. కానీ ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ఆ త‌ర‌వాత శంక‌ర్ రోబో క‌థ‌ను అనుకున్నాడు. కానీ కోట్ల బ‌డ్జెట్ తో చేయాల్సిన సినిమా మొద‌ట క‌మ‌ల్ హాస‌న్ ప్రీతి జింతా తో క‌లిసి ఫోటో షూట్ కూడా చేశాడు. మీడియా డ్రీమ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తామ‌ని ముందుకు వ‌చ్చింది.

Advertisement

కానీ క‌థ విషయంలో శంక‌ర్ కు క‌మ‌ల్ హాస‌న్ కు మ‌ధ్య బేదాభిప్రాయాలు వ‌చ్చాయి. దాంతో ఈ ప్రాజెక్ట్ ను శంక‌ర్ ప‌క్క‌న పెట్టేశాడు. ఆ వెంట‌నే బాయ్స్ సినిమాను తెర‌కెక్కించాడు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఈ త‌ర‌వాత మ‌ళ్లీ రోబో ను షురూ చేయాల‌ని అనుకున్నాడు. మొద‌ట ఈ సినిమా కోసం షారుఖ్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు. క‌థ విన్న త‌ర‌వాత షారుక్ ఖాన్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో పాటూ తానే నిర్మిస్తాన‌ని కూడా చెప్పాడు. క‌రీనా క‌పూర్ ను హీరోయిన్ గా అనుకున్నారు.

rajinikanth

కానీ ఈ సారి కూడా క‌థ విష‌యంలో బేదాభిప్రాయాలు వ‌చ్చాయి. దాంతో ఆ సినిమా మ‌ళ్లీ ఆగిపోయింది. ఆ త‌ర‌వాత అజిత్, అమీర్ ఖాన్ ల వ‌ద్ద‌కు కూడా ఈ సినిమా వెళ్లింది. కానీ వాళ్ల‌తో కూడా పూర్తికాలేదు. చివ‌రికి మ‌ళ్లీ ఈ సినిమా రజినీకాంత్ వ‌ద్ద‌కు వెళ్లింది. అయితే శంక‌ర్ ర‌జినీకాంత్ ను విల‌న్ గా అనుకున్నాడు. హీరోగా షారుక్ ను అనుకున్నాడు. కానీ షారుక్ మ‌ళ్లీ క‌థ విష‌యంలో ఒప్పుకోలేదు. దాంతో ర‌జినీకాంత్ తోనే చిట్టి క్యారెక్ట‌ర్ తో పాటూ హీరో పాత్ర‌ను వేయించాడు శంక‌ర్. ఈ సినిమా ఏ రేంజ్ లో వ‌సూళ్లు రాబ‌ట్టిందో తెలిసిందే.

Visitors Are Also Reading