ఎన్టీరామారావు నటుడిగా ఎంతటి క్రేజ్ సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినీచరిత్రలో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేసుకున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ పౌరానిక పాత్రలకు పెట్టింది పేరు. ఆయన రాముడు, కృష్ణుడి లాంటి పాత్రలు వేశారంటే సాక్షాత్తూ ఆ దేవుళ్లే కండ్ల ముందు కనిపించినట్టు ఉండేది. కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ రానించారు.
Advertisement
అతితక్కువ కాలంలో తెలుగుదేశం పార్టీని పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన రాజకీయ ప్రస్తానంలో ఎన్నో సవాళ్లను ఎదురుకున్నారు. అయితే ఎన్టీఆర్ లో మరో కోణం ఉందన్న సంగతి ఎవరికీ తెలియదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పురోహితుడిగా మారి పెళ్లి కూడా చేశారు. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. అసలు ఎన్టీఆర్ ఎవరి పెళ్లి చేశారు…? ఎందుకు పురోహితుడిగా మారి పెళ్లి చేయాల్సి వచ్చింది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం….జూలై 7, 1988 న ఉదయం 6గంటల 40 నిమిషాలకు ఒంగోలు పట్టణం రాంనగర్‌లోని టొబాకో సంస్థ ప్రాంగణంలోని కళ్యాణ వేదికలో పెళ్లి జరగాల్సి ఉంది.
Advertisement
ఈ పెళ్లికి ఎన్టీరామారావు వచ్చారు. వధూవరులను ఆశీర్వదించడానికి హాజరైన ఎన్టీఆర్ పెళ్లికొడుకు తండ్రి అయిన నాగభైరవ కోటేశ్వరరావును పిలిచి ‘‘కవి గారూ’’ అంటూ పిలిచి చెవిలో ఏదో చెప్పారు. ఆ తరవాత స్టేజిపై నుండి పురోహితుడు కిందకు దిగారు. ఎన్టీఆర్ మైక్ అందుకున్నారు.
ఆయన మట్లాడుతూ…సంస్కృతంలో ఉన్న వివాహ మంత్రాల అర్థం వీరికి తెలీదు. భార్యాభర్తల అన్యోన్యత, దాంపత్యం గురించి వివరించే ఆ మంత్రాల పరమార్థాన్ని మనకు అర్థమైన తెలుగులో చెప్పి ఈ పెళ్లి నేనే జరిపిస్తాను’’ అంటూ చెప్పారు. ఆ తరవాత సంస్కృతంలో మంత్రాలు చదువుతూ ఎన్టీఆర్….. వీరబాబు పద్మజల వివాహాన్ని జరిపించారు. ఎన్టీఆర్ చేసిన మొదటి మరియు చివరి వివాహం కూడా అదే. అప్పటి ప్రముఖ పత్రికల్లో ఈ వార్త వచ్చింది.
ALSO READ :
సింహా,లెజెండ్, అఖండ సినిమాలు 175రోజులు ఆడిన థియేటర్ల లిస్ట్ ఇదే..!