ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ లు ఓ రేంజ్ లో ఎక్స్పోజింగ్ చేస్తున్నారు. ఎక్కువ మాట్లాడితే బికినీ లే వేసుకుంటున్నారు. అయితే ఒకప్పటి హీరోయిన్లు మాత్రం ఎక్స్పోజింగ్ కు చాలా దూరంగా ఉండేవారు. గ్లామర్ షో అంటేనే వామ్మో అనేవాళ్ళు. అప్పటి ప్రేక్షకుల అభిరుచులు కూడా అలాగే ఉండేవి. అయితే 80వ దశకం లో హీరోయిన్లు నడుము చూపించడం మొదలైంది. దాంతో అప్పటి దర్శకులంతా ఈ ట్రెండు ని ఫాలో అయ్యేవారు.
Advertisement
అయితే దాసరి మాత్రం ఎక్స్పోజింగ్ కు ఆమడ దూరంలో ఉండేవారు. తన సినిమాలలో అలాంటి సీన్లు అస్సలు లేకుండా చూసుకునేవారు. దాసరి ఇండస్ట్రీకి పెద్దగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన సినిమాల విషయంలో కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. ఇక దాసరి నారాయణరావు ఎన్టీరామారావు తో ఎన్నో సూపర్ హిట్ సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
Advertisement
అయితే ఎన్టీఆర్ మాత్రం కాస్త మాస్ మసాలా సినిమాల్లో నటించేవారు. దాంతో దాసరి నారాయణరావు ఎన్టీఆర్ వద్దకు వెళ్లేందుకు మొదట భయపడ్డారట. కానీ సర్దార్ పాపారాయుడు సినిమాను ఆయనతోనే తీయాలని నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ వద్దకు వెళ్లి దాసరి కథ చెప్పారు. ఇక ఎన్టీఆర్ కూడా ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంతేకాకుండా హీరోయిన్ శ్రీదేవి పేరు చెప్పి హీరోయిన్ నడుము చూపిస్తే చాలు మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది అని సలహా ఇచ్చారట.
కానీ దాసరి సర్దార్ పాపారాయుడు సినిమాను పూర్తి చేసిన తర్వాత చూసిన ఎన్టీఆర్ షాక్ అయ్యారట. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత మీడియా సమావేశంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ…. దాసరిని మెచ్చుకున్నారు. శ్రీదేవి మేడం కుర్ర కారుకు మజా ఇస్తారు.. మీరు ఆమె నడుము చూపించి డబ్బు సంపాదిస్తారు అనుకున్నా. కానీ దాసరి చాలా విచిత్రమైన వారు అంటూ కామెంట్ చేశారు. నిజమే మరి ఆ విషయం లో దాసరిని ఎవరైనా మెచ్చుకోవాల్సిందే కదా.