టాలీవుడ్ మన్మథుడు నాగార్జున రెండో భార్య అమల గురించి చాలా మందికి తెలుసు. కానీ నాగార్జున మొదటి భార్య, నాగచైతన్య తల్లి దగ్గుబాటి లక్ష్మి గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. అంతేకాకుండా దగ్గుబాటి లక్ష్మీతో నాగార్జున ఎందుకు విడిపోయారు అన్న సంగతి మాత్రం చాలామందికి తెలియదు. దగ్గుబాటి లక్ష్మి చిన్ననాటి నుండే అమెరికాలో పెరిగటంతో పాటూ అక్కడే చదువుకున్నారు.
Advertisement
అయితే దగ్గుబాటి రామానాయుడు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అక్కినేని నాగేశ్వరావు తో మంచి అనుబంధం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ వియ్యంకులు కూడా అవ్వాలనుకున్నారు. దాంతో నాగార్జున ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వగానే అతడికి లక్ష్మీని వివాహం చేయాలని రామానాయుడు నిశ్చయించుకున్నారు. అమెరికాలో పెరిగిన లక్ష్మి అక్కడే ఉండేందుకు ఇష్టపడేవారు.
Advertisement
కానీ ఆమెను ఇండియాకు రప్పించి చెన్నైలో వీరిద్దరి వివాహం జరిపించారు. వివాహం తర్వాత నాగార్జున లక్ష్మీ దంపతులకు నాగచైతన్య జన్మించారు. పెళ్లి తరవాత లక్ష్మి ఇండియాలో ఉండడానికి ఇబ్బంది పడ్డారట. దాంతో అమెరికాకు వెళదామని అక్కడే స్థిర పడదామని నాగార్జునతో చెప్పారట. అయితే నాగార్జున హీరోగా సినిమాల్లో బిజీ అయిపోయారు. ఈ క్రమంలో అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడటానికి ఇష్టపడలేదు. దాంతో ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత హీరోయిన్ అమలతో నాగార్జునకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో నాగార్జున అమలను వివాహం చేసుకున్నారు. ఇక విడాకుల తర్వాత నాగచైతన్య కొంతకాలం వరకు లక్ష్మీ దగ్గరే పెరిగారు. కానీ ఆ తర్వాత నాగార్జున వద్దకు వచ్చి జోష్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం అటు నాగార్జున ఇటు దగ్గుబాటి లక్ష్మి ఎవరి ఫ్యామిలీతో వాళ్లు హ్యాపీగా ఉన్న సంగతి తెలిసిందే.