ఇప్పటి వరకూ తెలుగులో వచ్చిన మోస్ట్ ఎమోషనల్ సినిమా ఏదని అడిగితే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మాతృదేవోభవ సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమా ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. ఈ సినిమాకు అజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. మలయాళంలో అక్షద్ అనే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాలో మాదవి ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమాకు రీమేక్ గానే మాతృదేవోభవ చిత్రాన్ని తెరకెక్కించారు.
Advertisement
ఇక మొదటగా ఈ సినిమా కథను జీవితా రాజశేఖర్ లకు వినిపించారు. కానీ ఈ సినిమా లో నటించేందుకు జీవిత నిరాకరించింది. పెళ్లి తరవాత తాను సినిమాలకు దూరంగా ఉంటానని చెబుతూ జీవిత రిజెక్ట్ చేయడంతో రాజశేఖర్ కూడా ఈ సినిమా చేసేందుకు ఒప్పుకోలేదు. దాంతో మలయాలంలో నటించిన మాధవినే మాతృదేవోభవ సినిమాలోనూ తీసుకున్నారు. మాధవి నిజానికి తెలుగమ్మయే కాగా ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో మలయాళంలో సెటిల్ అయ్యింది.
Advertisement
ఇక తండ్రి పాత్రలో నాజర్ ను ఎంపిక చేశారు. ఈ సినిమా సంగీతం కోసం అప్పట్లో ఫుల్ బిజీగా ఉన్న కీరవాణిని సంప్రదించారు. అజయ్ కుమార్ కథ వినగానే కీరవాణి ఫిదా అయిపోయారు. తాను మ్యూజిక్ అందిస్తానని చెప్పారు. ఈ సినిమాకు పాటలను వేటూరు రాశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో సెట్ వేసి ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. 1993 అక్టోబర్ 22 వ తేదీన ఈ సినిమాను విడుదల చేశారు.
కానీ రిలీజ్ రోజు మాత్రం అస్సలు కలెక్షన్స్ రాలేదు. అంతే కాదు సినిమా విడుదలైన తరవాత పాజిటివ్ టాక్ వస్తోంది కానీ థియేటర్ కు వచ్చేవారి సంఖ్యమాత్రం తక్కువగానే ఉంది. రెండు వారాల తరవాత థియేటర్ కు వచ్చిన ప్రతిఒక్కరికీ ఖర్చీఫ్ లు ఇవ్వడం మొదలు పెట్టారు. ఆ తరవాత ఈ సినిమా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కట్ చేస్తే ఆరు కేంద్రాల్లో సినిమా వందరోజులు ఆడింది. సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి.
ALSO READ : దాసరిని పక్కన పెట్టి లంకేశ్వరుడు సినిమాలోని పాటలను చిరంజీవి ఎందుకు చిత్రించారు…?