మాస్టర్ భరత్ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు భరత్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఢీ, రెడీ, వెంకీ సినిమాలలో నటించి ప్రత్యేక ఆకర్షణ గాలిలిచాడు. సాధారణంగా చైల్డ్ ఆర్టిస్టులు కామెడీ చేయడం అరుదు. కానీ మాస్టర్ భరత్ మాత్రం తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.
Advertisement
ఇప్పటికీ మాస్టర్ భరత్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కామెడీ సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా భరత్ నటించిన వెంకీ, ఢీ సినిమాలలో అతడి నటనకు ఫిదా అయిపోయారు. ఇక భరత్ పెరిగి పెద్దవాడైన తర్వాత కొన్ని చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. కానీ చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చిన గుర్తింపును మాత్రం తిరిగి సంపాదించుకోలేకపోయాడు. కొంతకాలంగా భరత్ అసలు సినిమాల్లోనే కనిపించడం లేదు.
Advertisement
దానికి కారణం భరత్ ఓ పైపు సినిమాలు చేస్తూ మరోవైపు డాక్టర్ విద్యను అభ్యసించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం డాక్టర్ గా బిజీ ఉండడం వల్లే భరత్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడని సమాచారం. అంతేకాకుండా మాస్టర్ భరత్ స్క్రీన్ పై ప్రేక్షకులను ఎంతగానో నవ్వించినప్పటికీ అతడి జీవితంలో చెప్పుకోలేని విశాదాలు కూడా చాలా ఉన్నాయి. భరత్ యవ్వనంలో ఉన్న సమయంలో ఓ యాక్సిడెంట్ కు గురయ్యాడు.
ఆ తర్వాత ఆరోగ్యం బాగాలేక పూర్తిగా సన్నబడిపోయాడు. ఇక దాని నుంచి కోలుకున్న వెంటనే ఓ రోజు జిమ్ చేస్తుండగా ఒక రాడ్డు అతడి కన్నుకు తగిలింది. దాంతో భరత్ కంట్లో బ్లాక్ ఏర్పడింది. దాంతో కంటి చూపుని కూడా పూర్తిగా కోల్పోయాడు. ఇలా ఉంటే ఒకప్పుడు ఎంతగానో నవ్వించిన భరత్ తిరిగి ఫామ్ లోకి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
ALSO READ : వర్షం సినిమాలోని ఈ సీన్స్ లో మనకు కనిపించిన స్టార్ డైరెక్టర్ ని గుర్తు పట్టరా ?