Home » సంచ‌ల‌నం రేపుతున్న కృష్ణ వీలునామా…400 కోట్ల ఎవ‌రికి చెందుతాయంటే..?

సంచ‌ల‌నం రేపుతున్న కృష్ణ వీలునామా…400 కోట్ల ఎవ‌రికి చెందుతాయంటే..?

by AJAY
Ad

సూప‌ర్ స్టార్ కృష్ణ ఇటీవ‌ల గుండె పోటుతో మ‌ర‌ణించిన సంగతి తెలిసిందే. ఈ ఘ‌ట‌న కృష్ణ కుటుంబ స‌భ్యుల‌తో పాటూ అభిమానుల‌ను ప్రేక్ష‌కుల‌ను విషాదంలోకి నెట్టివేసింది. అయితే కృష్ణ మ‌ర‌ణానంత‌రం ఆయ‌న‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. అయితే అందులో కృష్ణ ఆస్తులకు సంబంధించి కూడా కొన్ని విష‌యాలు ఉన్నాయి. కృష్ణ సినిమాల ద్వారా కోట్ల‌లో సంపాదించ‌న సంగ‌తి తెలిసిందే.

Advertisement

ఒకే ఏడాది ప‌దుల సంఖ్య‌లో సినిమాలు చేసిన ఘ‌న‌త కూడా కృష్ణ‌కే సొంతం. అంతే కాకుండా చిరంజీవి కంటే కృష్ణ‌ ఎక్కువ రెమ్యున‌రేష‌న్ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అయితే సంపాదించిన డ‌బ్బును కూడా కృష్ణ వృధాగా ఖ‌ర్చు చేసేవారు కాదు. చాలా పొదుపుగా డ‌బ్బును ఖ‌ర్చు పెడుతూ ఎక్కువ మొత్తంలో ప్రాప‌ర్టీలు కొనుగోలు చేసేవారు. కేవ‌లం సినిమాల్లోన‌టించ‌డ‌మే కాకుండా స్వీయ నిర్మాణంలో కూడా సినిమాల‌ను నిర్మించారు.

Advertisement

ఇక కృష్ణ సంపాదించిన ఆస్థుల‌ను గ‌తంలోనే మ‌హేశ్ బాబు మ‌రియు ర‌మేష్ బాబుకు సమానంగా పంచార‌ట‌. కానీ ఆయ‌న పేరిట చివ‌రివ‌ర‌కూ నాలుగు వంద‌ల కోట్ల ఆస్తులు మాత్రం ఉండేవ‌ని టాక్ వినిపిస్తోంది. అయితే ఆ నాలుగు వంద‌ల కోట్ల ఆస్తుల‌ను కృష్ణ త‌న మ‌న‌వ‌ళ్లు మ‌రియు మ‌న‌వ‌రాళ్ల‌కు చెందాల‌ని వీలునామాలో రాసిన‌ట్టు ఫిల్మీ దునియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి.

అంతే కాకుండా ఈ వీలునామాను కృష్ణ రాసి చాలా కాలం అవుతోందట‌. వీలునామా అంటే త‌న అనంత‌రం తన పేరిట ఉన్న ఆస్తులు ఎవ‌రికి చెందాలో చెప్ప‌డ‌మే..ఇక కృష్ణ వీలునామా ప్ర‌కారం ఆయ‌న ఆస్తులు మ‌హేశ్ బాబు ర‌మేష్ బాబు కుమారులు కుమార్తెల‌తో పాటూ ఆయ‌న కుమార్తె మంజుల మ‌రియు మ‌రో కూతురు సంతానానికి కూడా చెంద‌నున్నాయి.

Visitors Are Also Reading