Home » మోహన్ బాబు నటించాల్సిన హిట్లర్ చిరంజీవి వద్దకు ఎందుకు వెళ్ళింది..? తెరవెనక జరిగిన స్టోరీ ఇదే..!

మోహన్ బాబు నటించాల్సిన హిట్లర్ చిరంజీవి వద్దకు ఎందుకు వెళ్ళింది..? తెరవెనక జరిగిన స్టోరీ ఇదే..!

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు మెగాస్టార్ అంటే తెలియని సినీ లవర్స్ ఉండరు. చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అందులో చిరంజీవి నటించిన హిట్లర్ సినిమా కూడా ఒకటి. హిట్లర్ కు ముందు చిరంజీవి మాస్.. యాక్షన్, రొమాంటిక్ ఇలా చాలా వేరియంట్స్ చూపించాడు.

Advertisement

కానీ హిట్లర్ సినిమాలో బాధ్యతాయుతమైన పాత్రలో నటించాడు. ఈ సినిమాలో చిరుకు ఐదుగురు సోదరీమణులు ఉంటారు. కాగా ఈ సినిమా ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మంచి సినిమాగా నిలవడంతో పాటు బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమా విడుదలకు ముందు తెర వెనక చాలా కథ నడిచింది.

Advertisement

మలయాళం లో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన సినిమా హక్కులు ఎడిటర్ మోహన్ చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు హీరోగా మొదట మోహన్ బాబు అనుకున్నారు. అదేవిధంగా డైరెక్టర్ గా ఇవివి సత్యనారాయణ అనుకున్నారు. కానీ ఇవివి ఒప్పుకోలేదు. దాంతో ఆయన స్థానంలో ముత్యాల సుబ్బయ్యను దర్శకుడిగా తీసుకున్నారు.

ముత్యాల సుబ్బయ్య కూడా హిట్లర్ చేయడానికి ఓకే చెప్పారు. అయితే సినిమా కథ ముత్యాల సుబ్బయ్య వద్దకు వెళ్ళిన తర్వాత హీరో కూడా మారిపోయాడు. ముత్యాల సుబ్బయ్య మోహన్ బాబు స్థానంలో చిరంజీవిని అనుకున్నాడు. ఇక చిరుకి కథ చెప్పగా వెంటనే ఓకే చెప్పేశాడు. అలా మోహన్ బాబు మిస్ చేసుకున్న హిట్లర్ సినిమా చిరంజీవి వద్దకు వెళ్ళింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

Visitors Are Also Reading