Home » సినిమాల్లో నటించి నా పరువు తీయకు అని మమ్ముట్టి ఎందుకు హెచ్చరించారు ? దుల్కర్ భార్య ఎవరో తెలుసా ?

సినిమాల్లో నటించి నా పరువు తీయకు అని మమ్ముట్టి ఎందుకు హెచ్చరించారు ? దుల్కర్ భార్య ఎవరో తెలుసా ?

by AJAY
Ad

మ‌హాన‌టి సినిమాతో పాన్ ఇండియా లెవ‌ల్ లో గుర్తింపు తెచ్చుకున్న హీరో దుల్క‌ర్ స‌ల్మాన్. రీసెంట్ గా సీతారామం సినిమాతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను అందుకున్నాడు. దుల్కర్ మ‌ల‌యాళ హీరో కాగా సీతారామం సినిమాను టాలీవుడ్ బ్యాన‌ర్ వైజ‌యంతి మూవీస్ పాన్ ఇండియా లెవ‌ల్ లో తెర‌కెక్కించింది. ఇక తెలుగువాళ్లు ఈ సినిమాను త‌మ సినిమా అనుకున్నారు. ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌వ‌డంతో దుల్క‌ర్ స‌ల్మాన్ కు తెలుగులో అభిమానులు పెరిగిపోయారు.

Advertisement

ఇక ఈ సినిమా విజ‌యం త‌ర‌వాత అస‌లు దుల్క‌ర్ స‌ల్మాన్ బ్యాగ్రౌండ్ ఏంటి అని తెలుసుకోవాల‌ని నెట్టింట తెగ‌వెతుకున్నాతున్నారు. నిజానికి దుల్క‌ర్ స‌ల్మాన్ మరెవ‌రో కాదు. మ‌ల‌యాళ స్టార్ హీరో మ‌మ్ముట్టి ముద్దుల కుమారుడే దుల్క‌ర్ స‌ల్మాన్. సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన దుల్క‌ర్ ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల్లో న‌టించాడు. భాష‌తో సంబంధం లేకుండా క‌థ బ‌లంగా ఉంటే ఏ ప‌రిశ్ర‌మ‌లో అయినా సినిమాలు చేసేందుకు రెడీ అవుతాడు.

Advertisement

దాంతో బేసిక్ గా మ‌ల‌యాళ హీరోఅయిన‌ప్ప‌టికీ తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో కూడా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. ఇదిలా ఉండ‌గా దుల్క‌ర్ స‌ల్మాన్ తండ్రి మమ్ముట్టికి దుల్క‌ర్ సినిమాల్లోకి రావ‌డం ఇష్టం లేద‌ని చెప్పాడు. అందువ‌ల్లే త‌న‌కు చిన్న‌ప్పుడు డ్యాన్స్ లు ఫైట్ లు నేర్పించ‌లేద‌ని చెప్పాడు. అంతే కాకుండా చ‌దువుకుని ఉద్యోగం చేయాల‌ని చెప్ప‌డంతో తాను డిగ్రీ చ‌దువుకుని దుబాయ్ లో ఉద్యోగం చేశాన‌ని చెప్పాడు.

అక్క‌డ ఒకే ద‌గ్గ‌ర కూర్చుని ఉద్యోగం చేయ‌డం త‌న వ‌ల్ల కాలేద‌ని చెప్పాడు. దాంతో ఇంటికి వ‌చ్చి సినిమాల్లో న‌టిస్తాన‌ని చెబితే….యాక్టింగ్ అంటే సులువైన ప‌ని కాదు నా ప‌రువు తీయ‌కు అంటూ కోప్ప‌డ్డార‌ని చెప్పారు. తాను విన‌క‌పోవ‌డంతో నీ ఇష్టం అని వ‌దిలేశార‌ని చెప్పారు. ఆ త‌ర‌వాత దుల్కర్ క‌ష్ట‌ప‌డి సినిమాల్లో పైకి వ‌చ్చాడు. ఇదిలా ఉండ‌గా దుల్క‌ర్ స‌ల్మాన్ 2011లో చెన్నైకి చెందిన ప్ర‌ముఖ ఆర్కిటెక్ అమ‌ల సుఫియాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు.

Visitors Are Also Reading