టాలెంట్ ఉండాలే కానీ ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు. అప్పటి వరకూ ఎన్నో కష్టాలు ఎదురుకున్నవాళ్లు ఒక్కసారిగా సెలబ్రెటీలు అవుతారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తరవత టాలెంట్ తో చాలా మంది సెలబ్రెటీ స్టేటస్ ను అందుకున్నారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పల్సర్ బైక్ మీద రార బావో అనే జానపదపాట వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇదే పాటకు ఈటీవీలో ప్రసారం అయ్యే శ్రీదేవి డ్రామాకంపెనీలో గాజువాక డిపో కండక్టర్ జాన్షీ ఎంతో ఫేమస్ అయ్యింది.
Advertisement
శ్రీదేవి డ్రామా కంపెనీ విడుదల చేసిన ప్రోమోలో ఝాన్సీ డ్యాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాంతో ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దాంతో ఝూన్సీ పలు యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలో ఓ ఇంర్వ్యూలో ఝాన్సీ తన జీవితంలో ఎదురుకున్న కష్టాల గురించి చెప్పుకొచ్చింది. తన తల్లి దండ్రులు చిన్న తనంలోనే గొడవపడి విడిపోయారని చెప్పింది.
Advertisement
దాంతో తన తల్లి ఎంతో కష్టపడి కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించిందని చెప్పింది. ఎనిమిదో తరగతిలో తాను డ్యాన్స్ నేర్చుకున్నానని అప్పటి నుండే స్టేజ్ షోలు ఇచ్చేదానినని పేర్కొంది. అప్పుడు ఒకడ్యాన్స్ షోకు 150 రూపాయలు ఇచ్చేవారని చెప్పింది. అలా స్టేజ్ పై డ్యాన్స్ లు చేస్తూ తన కుటుంబానికి అండగా ఉన్నానని తెలిపింది.
కండక్టర్ జాబ్ వచ్చిన తరవాత తన తమ్ముడిని ఎంబీఏ వరకూ చదివించానని చెప్పింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని తండ్రి వదిలేస్తే డ్యాన్స్ ను వృత్తిగా ఎంచుకున్నానని డ్యాన్స్ చేసే అమ్మాయిలను చులకనగా చూడవద్దని కోరింది. తాను ఇంటర్ లో ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లిచేసుకున్నట్టు పేర్కొంది. అతడు కూడా డ్యాన్సరే అని తెలిపింది. తాము కలిలి పలు టీవీ ఛానల్స్ లో డ్యాన్స్ షోలలో చేశామని తెలిపింది.