కొన్ని సినిమాలను దర్శకనిర్మాత లు ఒక హీరో తో తీయాలని అనుకుంటే చివరికి మరో హీరోతో చేయాల్సి వస్తుంది. అలా చేసిన సినిమా హిట్ అయితే మిస్ చేసుకున్న హీరో బాధపడక తప్పదు. అయితే సినిమా లు అనేక కారణాల వల్ల చేతులు మారడం కామన్. ఇప్పటి వరకు అలా ఎన్నో సినిమాలు మొదట ఒక హీరోను అనుకుని మరో హీరోతో చేసినవి ఉన్నాయి. అలాంటి సినిమానే మెగాస్టార్ కెరీర్ లో కూడా ఉంది.
Also Read: మోహన్ బాబు తో తీయాల్సిన ‘హిట్లర్’ సినిమా చిరంజీవి దగ్గరికి ఎలా వెళ్లిందో తెలుసా..?
Advertisement
అయితే ఇక్కడ చిరంజీవి లక్కీ …మూడేళ్ళుగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న సమయం లో హిట్లర్ సినిమా వెతుక్కుంటూ వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా మలయాళం లో మమ్ముట్టి నటించిన హిట్లర్ సినిమా కు రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాకు సిద్ధికి దర్శకత్వం వహించారు.
Also Read: పవన్ కళ్యాణ్ అభిమానించే అలనాటి స్టార్ హీరో ఎవరో తెలుసా ? అస్సలు నమ్మ లేరు !
Advertisement
అయితే ఈ సినిమా విడుదలకు వారం ముందు టాలీవుడ్ నిర్మాత మరియు ఎడిటర్ మోహన్ రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకు ఈవివిని దర్శకుడిగా అనుకున్నారు. కాగా ఈ సినిమా కథ ను మొదట మోహన్ బాబు తో చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ సమయం లో మోహన్ బాబు అదిరింది అల్లుడు, వేదేవడండి బాబు సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు.
దాంతో మోహన్ బాబు నుండి నిర్మాత చిరంజీవికి షిఫ్ట్ అయ్యాడు. ఈ సినిమా కథను మెగాస్టార్ కు చెప్పగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ క్రమంలో దర్శకుడిని కూడా మార్చేశారు. దర్శకుడిగా ముత్యాల సబ్బయ్యను పెట్టుకున్నారు. ఇక అలా మోహన్ బాబు మిస్ చేసుకున్న హిట్లర్ సినిమా తో చిరంజీవి కి బ్లాక్ బస్టర్ పడింది.
Also Read: హీరోయిన్ రాశి గుండెలు పిండేసే లవ్ స్టోరీ వెనుక రహస్యం.. కోటీశ్వరులకు నో చెప్పి ఆయనతోనే..!!