అంబేద్కర్ మన దేశానికి రాజ్యాంగాన్ని రాసిన ఒక గొప్ప వీరుడు. ఆయన గురించి మాటల్లో చెప్పడం చాలా కష్టం. అలాంటి అంబేద్కర్ 125 వ జయంతి ఉత్సవాలను హైదరాబాదులో చాలా అట్టహాసంగా నిర్వహించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ తరుణంలోనే ఏప్రిల్ 14వ తేదీన హైదరాబాద్ నడిఒడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ సర్కార్ ఆవిష్కరించనుంది. హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్ కు అనుకొని దాదాపు 11.80 ఎకరాల స్థలంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం నిర్మించారు.
also read:శాకుంతలం సినిమాలో నటించిన హీరో… సమంత కంటే వయసులో ఇంత చిన్నవాడా?
Advertisement
ఈ యొక్క కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ హాజరవనున్నారు. ఈ ఆవిష్కరణ తర్వాత హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కూడా కురిపించనున్నారు. ముఖ్యంగా ఇక్కడ అంబేద్కర్ మ్యూజియం మరియు ఆయన జీవితానికి సంబంధించిన ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేశారు. అలాగే గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. విగ్రహావిష్కరణ సందర్భంగా 20 మంది బౌద్ధ గురువులు ప్రార్ధనలు నిర్వహిస్తారు. ఈ విగ్రహావిష్కరణ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
Advertisement
also read:అనుష్క జాతకంలో ఇంత పెద్ద దోషం ఉందా ? అందుకే పెళ్ళికి దూరంగా ఉన్నారా ?
ఈ యొక్క ఏర్పాట్లకు తెలంగాణ సర్కార్ 10 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 50,000 మంది ఆసీనులయ్యేలా విగ్రహం ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. అంబేద్కర్ స్మారక ప్రాంగణ విస్తీర్ణం 11.80ఎకరాలు,విగ్రహ ఏర్పాటు విస్తీర్ణం, పీఠం నిర్మాణం 2ఎకరాలు, విగ్రహ పీఠం ఎత్తు 50 అడుగులు, వెడల్పు 45 అడుగులు, విగ్రహం బరువు 435 టన్నులు, పీఠం వెడల్పు 172 అడుగులు, విగ్రహ తయారీకి ఉపయోగించిన ఉక్కు 791 టన్నులు, ఇత్తడి 96 మెట్రిక్ టన్నులు, దీని తయారీ కోసం రోజు పనిచేసిన కార్మికులు 425 మంది, దేశంలోనే అతి ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిఒడ్డున ప్రముఖ శిల్పి రామ్ వి సుతార్ రూపుదిద్దారు.
also read:“బలగం” షూటింగ్ కోసం ఇల్లు ఇస్తే.. వేణు థాంక్స్ కూడా చెప్పలేదంటున్న ఇంటి ఓనర్!