Home » గుర్తుపట్టలేనంతగా మారిపోయిన యజ్ఞం సినిమా హీరోయిన్…!

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన యజ్ఞం సినిమా హీరోయిన్…!

by Bunty
Ad

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగాలంటే అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా కలిసిరావాలి. ఎంతో అందం ఉన్నప్పటికీ కొంతమంది హీరోయిన్లు కేవలం ఒకటి రెండు సినిమాలకే పరిమితమై… ఆ తర్వాత కనుమరుగైపోతారు. ఇలా చాలామంది హీరోయిన్లను మనం చూస్తూనే ఉన్నాం. ఈ కోవలోకి వచ్చిన బ్యూటీ సమీరా బెనర్జీ. ఈ అమ్మడు పేరు చెబితే పెద్దగా ఎవరూ గుర్తుకు పట్టకపోవచ్చు కానీ తెలుగులో చేసిన యజ్ఞం సినిమాలో హీరోయిన్ అంటే టక్కున గుర్తుపడతారు.

 

Unknown And Interesting Facts About Yagnam Movie Actress Sameera Banerjee

ఈ సినిమాలో ఈ అమ్మడు అద్భుతంగా నటించింది. అంతేకాకుండా తన అందంతో కుర్రాళ్లను పిచ్చెక్కించింది. తాను నటించిన మొదటి సినిమాతోనే ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించిన సమీరా బెనర్జీ ఆ ఒక్క సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీని వీడింది. అందం, నటన ఉన్నప్పటికీ తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తన స్వస్థలం కోల్కత్తాకి వెళ్ళిపోయింది. ఇక నీరజ్ శర్మ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది.

Advertisement

Advertisement

వివాహ అనంతరం తాను బాలీవుడ్ సీరియల్స్ లో యాక్ట్ చేసింది. సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సీరియల్స్ లో మంచి పాత్రల్లో నటించి స్టార్ నటిగా పేరును సంపాదించుకుంది. యజ్ఞం సినిమాలో మిస్ బ్యూటీలా ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం ఆంటీల మారిపోయింది. ఈ అమ్మడుని చూసి అందరూ షాక్ అవుతున్నారు. యజ్ఞం సినిమాలో హీరోయిన్ ఇంతలా మారిపోయిందా…. అసలు తనేనా ఈవిడ… అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading