Home » ఐపీఎల్ 2022 లో ఉమ్రాన్ మాలిక్ సంపాదన ఎంతో తెలుసా..?

ఐపీఎల్ 2022 లో ఉమ్రాన్ మాలిక్ సంపాదన ఎంతో తెలుసా..?

by Azhar
Ad
ఐపీఎల్ 2022 సీజన్ లో స్పీడ్ స్టార్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రతి మ్యాచ్ లోను 150 కీ.మీ కంటే ఎక్కువ వేగంతో బంతులు విసురుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే డబ్బులు కూడా బాగానే సంపాదించాడు. అయితే ఈ సీజన్ లో అసలు ఉమ్రాన్ మాలిక్ సంపాదన ఎంత అనేది తెలుసుకుందాం..! గత ఐపీఎల్ లో నటరాజన్ గాయం కారణంగా నెట్ బౌలర్ గా ఉన్న ఉమ్రాన్ జట్టులోకి వచ్చి తన స్పీడ్ తో ప్రపంచాన్ని తన వైపుకు తిపుకున్నాడు.
అయితే ఉమ్రాన్ కు వచ్చిన గుర్తింపుతో ఈ ఐపీఎల్ 2022 మెగావేలానికి అతడిని వదిలి పెట్టకుండా ఏకంగా 4 కోట్ల రూపాయలతో రిటైన్ చేసుకున్న సన్ రైజర్స్ యాజమాన్యం. కానీ కేవలం ఈ నాలుగు కోట్లు మాత్రమే ఉమ్రాన్ సంపాదన కాదు. ఈ ఐపీఎల్ లో హైదరాబాద్ 14 మ్యాచ్ లు ఆడగా ప్రతి మ్యాచ్ లో కూడా ఉమ్రాన్ ఉన్నాడు. అలాగే అతను ఆడిన అన్ని మ్యాచ్ లలో కూడా ఉమ్రాన్ దే ఫాస్టెస్ట్ డెలివరీ. అందుకుగాను ఉమ్రాన్ కు ప్రతి మ్యాచ్ లవ్ లక్ష చొప్పున 14 లక్షలు వచ్చాయి.
వీటితో పాటుగానే రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల రూపంలో మరో రెండు లక్షలు వచ్చాయి. అలాగే గేమ్ ఛేంజర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల రూపంలో ఇంకో రెండు లక్షలు రాగ… మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు ద్వారా మరో ఓ లక్ష అతని ఖాతాలో చేరింది. ఇవి మొత్తం 19 లక్షలు అవుతుండగా… ఫైనల్స్ లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు రూపంలో ఇంకో 10 లక్షలు కలిపి మొత్తం 29 లక్షలు ఉమ్రాన్ మాలిక్ సంపాదించాడు. అయితే ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ ది సీజన్ కూడా ఉమ్రాన్ కే వస్తుంది అనుకోగా.. ఫైనల్ మ్యాచ్ లో 157.3 కి.మీతో బౌలింగ్ చేసి గుజరాత్ బౌలర్ ఫెర్గూసన్ ఆ అవార్డు అందుకున్నాడు. లేకుంటే మరో 10 లక్షలు ఉమ్రాన్ ఖాతాలో చేరిపోయేవి.

Advertisement

Visitors Are Also Reading