మనిషి జీవితం చాలా గొప్పది. ఎవరూ చేయలేని, జీవితాన్ని మానవ జాతి మాత్రమే అనుభవిస్తుంది. ఇప్పుడు అంటే ఇలా ఆశీర్వదించడం లేదు కానీ, పాత కాలంలో ఎవరైనా కొత్త జంటను దీవించాలంటే గంపెడు పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి అనేవారు. కాలంతో పాటు సంతానం సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఒకరిద్దరు పిల్లలను కనిపించడమే కష్టమైపోతుంది. ఒక్క సంతానంతో సరి పుచ్చుకునే వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది.
Advertisement
ప్రభుత్వాలు చేపట్టిన కుటుంబ నియంత్రణ పథకాల పుణ్యమే ఇదంతా, కానీ ఈ కాలంలోనే గంపెడు పిల్లల్ని కనేవారు అక్కడక్కడా ఉన్నారు. అవును గంపెడు కాదు, ఏకంగా 102 మంది పిల్లలను కన్నాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, ఉగాండాలోని బుగిసాకు చెందిన మూసా హసహ్య అనే వ్యక్తికి 12 మంది భార్యలు ఉన్నారు. వీరందరికీ కలిపి 102 మంది పిల్లలు ఉన్నారు. అంతేకాదు మూసాకు మనవళ్ళు, మనవరాలు కలిపి 568 మంది ఉన్నారు. వీరంతా 12 బెడ్ రూమ్ ల ఇంట్లో కలిసి ఉంటున్నారు.
Advertisement
కుటుంబ సభ్యుల సంఖ్య భారీగా ఉండడంతో కుటుంబ పోషణ రోజురోజుకి కష్టంగా మారుతుంది. పిల్లలను వద్దనుకున్నా మూస, తన భార్యలను ఇకనుంచి గర్భనిరోధక మాత్రలు వాడమని కోరాడు. ఇదే విషయంపై మూస హసహ్య మాట్లాడుతూ, తన ఆదాయం పరిమితంగా ఉన్నందున, ఎక్కువ మంది పిల్లలను పెంచలేను. అందుకే గర్భధారణ వయస్సులో ఉన్న భార్యలు అందరికీ గర్భనిరోధక మాత్రలను వాడమని సలహా ఇచ్చానని పేర్కొన్నాడు. మూస హసహ్య ఇంకా మాట్లాడుతూ, ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవాలనుకునే యువకులకు కొన్ని సలహాలు సూచనలు కూడా ఇస్తున్నాడు. ఇకనుంచి నాలుగు కంటే ఎక్కువ పెళ్లిళ్లు వారు అలా చేయవద్దని యువతకు సలహా ఇస్తున్నాడు. ఎందుకంటే ఎక్కువ మంది భార్యలు, పిల్లలు ఉంటే, కొన్ని సంఘటనలు చెడుగా మారడం ప్రారంభిస్తాయని చెప్పాడు.
Read also : Chalapati Rao: ఆర్యన్ రాజేష్ పెళ్లి పెద్దగా నిలబడ్డ చలపతిరావు.. ఎందుకంటే.?