చిత్రం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో ఉదయ్ కిరణ్. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొతం చేసుకుంది. దాంతో మొదటి సినిమాతోనే ఉదయ్ కిరణ్ అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ సినిమా తరవాత ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే, నువ్వునేను, నీ స్నేహం సినిమాలతో వరుస హిట్ లను అందుకున్నాడు.
Advertisement
దాంతో అతి తక్కువ కాలంలోనే ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. గ్యాప్ లేకుండా సినిమాలు చేశాడు. ఒకానొక సమయంలో డేట్స్ ఇవ్వలేక సినిమాలను రిజెక్ట్ చేశాడు. అలా ఎదిగిన ఉదయ్ కిరణ్ కెరీర్ ఒక్కసారిగా అయ్యింది. కుటుంబ కారణాలు సినిమాలు ఫ్లాప్ అవ్వడం…వచ్చిన సినిమాలను క్యాన్సిల్ చేయడం వల్ల ఉదయ్ కిరణ్ డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.
Advertisement
ఇక ఉదయ్ కిరణ్ తో కలిసి పనిచేసిన నటీనటులు టెక్నిషియన్స్ అతడు చాలా మంచివాడని చెబుతుంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ తో కలిసి నటించిన దిల్ రమేష్ ఉదయ్ కిరణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉదయ్ కిరణ్ వరుస సినిమాలతో బిజీ అయినా ఎలాంటి గర్వం ఉండేది కాదని అన్నారు. అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడని చెప్పారు.
ఉదయ్ చనిపోయే సమయానికి తాను ఆయనకు చాలా క్లోజ్ అయ్యానని చెప్పారు. తనను ఎప్పుడూ మంచి స్థాయికి వెళతావని ఉదయ్ కిరణ్ ప్రోత్సహించేవారని చెప్పారు. అంతే కాకుండా అప్పట్లోనే ఉదయ్ కిరణ్ ఒక్కో సినిమాకు రూ.75 లక్షల నుండి కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకునేవారని చెప్పారు. కెరీర్ డౌన్ ఫాల్ అవ్వడం వల్లనే ఆయన స్ట్రెస్ కారణంగా అత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.