టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో వి.ఎన్. ఆదిత్య కూడా ఒకరు. వి.ఎన్ ఆదిత్య ఉదయ్ కిరణ్ రీమాసేన్ హీరో హీరోయిన్లుగా మనసంతా నువ్వే అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత ఉదయ్ కిరణ్ వి.ఎన్.ఆదిత్య కాంబినేషన్ లో శ్రీరామ్ అనే సినిమా వచ్చింది.
Advertisement
అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఉదయ్ కిరణ్ ఓసారి అసహనానికి గురయ్యారని ఆదిత్య రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. శ్రీరామ్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ పై ఉదయ్ కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు. ఉదయ్ కిరణ్ కు ఇతర సినిమాల షూటింగ్ లు ఉండటం వల్ల ఆ ప్రెజర్ తో అసిస్టెంట్ డైరెక్టర్ పై అరిచారని అన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ తప్పేమీ లేదని అన్నారు.
Advertisement
అసలు పద్ధతి ప్లాన్ లేదా ఒక రాక్షసుడిలా పనిచేస్తున్నాను…. ఇండస్ట్రీలో అందరూ సీనియర్ హీరోలే కానీ ఎవరికీ బుర్ర లేదా అంటూ అసిస్టెంట్ డైరెక్టర్ పై ఉదయ్ కిరణ్ గట్టిగా అరిచారని చెప్పారు. దాంతో ఉదయ్ కిరణ్ కు ఎన్ని టెన్షన్ లు ఉన్నా అసిస్టెంట్ డైరెక్టర్ పై అరవడం తనకు నచ్చలేదని చెప్పారు. అతడు ఫ్యూచర్ లో కాబోయే దర్శకుడని…అలా అరవడంతో తాను మౌనంగా ఉండిపోయానని పాకప్ చెప్పానని తెలిపారు.
షూటింగ్ కు పాక్ అప్ చెప్పి మధ్యలోనే నడుచుకుంటూ వెళ్ళిపోయా అని చెప్పారు. దాంతో తన కెమెరామెన్ ఇతర సిబ్బంది కార్ వేసుకుని వచ్చారని అన్నారు. ఉదయ్ కిరణ్ చివరి రోజుల్లో తనతో చాలా సన్నిహితంగా ఉండేవారని తెలిపారు. చనిపోయే వారం ముందు కూడా తనకు ఫోన్ చేసి గంటల తరబడి మాట్లాడని విఎన్ ఆదిత్య చెప్పారు.
ALSO READ :
స్వయంకృషి సినిమా ఎఫెక్ట్…. చెప్పులషాపుల పేరు మార్చిన యజమానులు..!
వైరల్ అవుతున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పెళ్లి పత్రిక చూసారా ?