ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రేమ కథ చిత్రాలలో నటించి లవర్ బాయ్ గా ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. అతిచిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఇండస్ట్రీలో అందరితో చాలా క్లోజ్ గా ఉండేవాడు ఉదయ్ కిరణ్.
Advertisement
తనకు ఎంత కష్టం వచ్చినా ఎవరితో చెప్పుకోకుండా తనలో తానే బాధపడి పోయేవాడు. 24 అక్టోబర్, 2012న విషిత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఉదయ్ కిరణ్.
చాలా సంతోషంగా గడుపుతున్న సమయంలో అనివార్య కారణాలతో ఆ**త్య చేసుకున్నాడు. ఇక, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మురళీమోహన్ మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అతడు సినిమాలో హీరోగా మొదటగా ఉదయ్ కిరణ్ ను సంప్రదించారట. ఆ సినిమాకు ఉదయ్ కిరణ్ కూడా ఓకే చెప్పారట. ఉదయ్ కిరణ్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని అల్లు అరవింద్ చూసుకునేవాడట.
Advertisement
ఉదయ్ కిరణ్ ఏ సినిమాలో నటించాలి, తన డేట్స్ గురించి తనకు సంబంధించిన ప్రతి విషయాలను, తన డైరీ, ఎవరికి ఏ సినిమా ఒప్పుకున్నాను ఇలాంటి వ్యవహారాలు అన్ని అల్లు అరవింద్ దగ్గరుండి మరీ చూసుకునేవాడని మురళీమోహన్ తెలియజేశాడు. అయితే అతడు సినిమాలో ఉదయ్ కిరణ్ హీరోగా ఒప్పుకున్నాడు కాబట్టి మురళీమోహన్ వెళ్లి డేట్స్ కోసం అడగ్గా… ఉదయ్ కిరణ్ డేట్స్ ప్రస్తుతం ఖాళీగా లేవు అని అరవింద్ చెప్పడంతో ఉదయ్ కిరణ్ కూడా ఏమీ చేయలేకపోయాడట. దీంతో అతడు సినిమా ఉదయ్ కిరణ్ నటించిన నటించాల్సి ఉంది. కానీ డేట్స్ కుదరకపోవడంతో మహేష్ బాబుని సంప్రదించారట. దీంతో ఈ సినిమాను మహేష్ బాబు చేసి హిట్ కొట్టారు.
ఇవి కూడా చదవండి
హాస్పిటల్ నుంచి ఉపాసన అంత త్వరగా ఎలా డిశ్చార్జ్ అయ్యారు?
బాహుబలి సినిమాలో ఈ సీన్స్ గమనించారా…! రాజమౌళి గారు ఇది ఎలా మిస్ అయ్యారు..!
పవన్ కళ్యాణ్ తమ్ముడు మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా…!