Home » ఆసియా కప్: కరోనా బారిన పడ్డ ఆటగాళ్లు.. ఇద్దరికి పాజిటివ్..!

ఆసియా కప్: కరోనా బారిన పడ్డ ఆటగాళ్లు.. ఇద్దరికి పాజిటివ్..!

by Sravya
Ad

కొన్ని రోజుల్లోనే ఆసియా కప్ ప్రారంభం కాబోతోంది ఈ సంవత్సరం ఆసియా కప్ కి పోటీ ఇస్తున్న శ్రీలంక టీం లో ఇద్దరు ప్లేయర్లు కి కరోనా సోకినట్టు తెలుస్తోంది. భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధం దెబ్బ తినడం వలన ఈ ఆసియా కప్ ని హైబ్రిడ్ ఫార్మేట్ లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీని ప్రకారం పాకిస్థాన్లో కేవలం నాలుగే మ్యాచ్లో జరగబోతున్నాయి తొమ్మిది ముఖ్యమైన మ్యాచులు శ్రీలంకలో జరగబోతున్నాయి. అయితే లంక జట్టులోని ఇద్దరు ఆటగాళ్లకు ఇన్ఫెక్షన్ సోకడం టోర్నీకి ఎదురు దెబ్బ.

Advertisement

Advertisement

శ్రీలంక ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అవిష్కా ఫెర్నాండో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కుషాల్ ఫెరీరా ఇద్దరికీ కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే వీళ్ళిద్దరికీ వైరస్ నిజంగా సోకిందా అనే దాని మీద అధికారిక సమాచారం లేదు. మరి ఈసారి ఆసియా కప్ కి ఏ ఇబ్బంది జరగకుండా పూర్తవుతుందో లేదో చూడాలి. ఆసియా కప్ ఆగస్టు 30న ప్రారంభం అవ్వబోతోంది. ముల్తాన్ లో పాకిస్తాన్ నేపాల్ తొలి మ్యాచ్ ఆడబోతున్నాయి.

Also read:

Visitors Are Also Reading