తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు వంటి ఓ పదిమందిలోపు హీరోలు మాత్రమే స్టార్లుగా కొనసాగే వారు. అప్పుడు సినిమాలు అంటే వీరితో మాత్రమే వచ్చేవి. కానీ ప్రస్తుత కాలంలో ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు పుట్టుకొచ్చారు. ఇందులో ఒక హీరోకు మించి మరో హీరో సినిమాలు ఆడుతున్నాయి.. ఇక రెమ్యూనరేషన్ కూడా అప్పట్లో వేళల్లో లేదంటే లక్షల్లో ఉండేది. కానీ ఇప్పుడు కోట్లల్లో లేదంటే వందల కోట్లు దాటింది. అలా దినదినం టాలీవుడ్ రేంజ్ పెరిగిపోయింది. అలాంటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో చాలామంది హీరోలు సినిమాల ద్వారా బిజినెస్ ల ద్వారా ఎంతో సంపాదించి మంచి పొజిషన్ లో ఉన్నారు.
Advertisement
మరి అలాంటి ఇండస్ట్రీలో అత్యధికంగా ధనవంతులైన వారు కేవలం ఇద్దరే ఇద్దరు హీరోలు.. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.. ఇండస్ట్రీలో అత్యధిక ధనవంతులైన హీరోల్లో ముందుగా చెప్పుకోవాల్సింది నాగార్జున. అక్కినేని నాగేశ్వరరావు సంపాదించిన సంపాదన మొత్తం నాగార్జునాకే దక్కిందని చెప్పవచ్చు. తన తండ్రికి ఒక్కడే కొడుకు కావడంతో ఏఎన్ఆర్ సంపాదనంతా నాగార్జునకు వచ్చేసింది. దీంతో పాటుగా ఇతర వ్యాపారాలు, అన్నపూర్ణ స్టూడియో, నాగార్జున సినిమాల ద్వారా మొత్తం కలిపితే దాదాపుగా 12 వేల కోట్ల వరకు ఉంటుందని సమాచారం.. ఇక రెండవ స్థానంలో ఉన్నది. మెగాస్టార్ చిరంజీవి.
Advertisement
also read:బాలకృష్ణ అన్ స్టాపబుల్ కి మెగాస్టార్.. పవన్ కళ్యాణ్ కంటే ముందే..!
తన సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎంతో కష్టపడి ఇండస్ట్రీకే పెద్దన్నలా మారారు. అప్పట్లో ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈయన దాదాపు 150 పైగా చిత్రాల్లో నటించారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపార రంగాల్లో పెట్టుబడులు పెట్టాడు. ఇలా చిరంజీవి మొత్తం ఆస్తులు కలిపి ఎనిమిది వేల కోట్ల వరకు ఉంటుందట.. ఇక మూడో స్థానంలో ఉన్నది వెంకటేష్. రామానాయుడు స్టూడియో ఇతర సినిమా వ్యాపారాలతో 6000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక తర్వాత స్థానంలో ఉన్నది బాలకృష్ణ ఈయనకు రెండువేల కోట్లు, ఆ తర్వాత అల్లు అర్జున్ 1600 కోట్లతో ఐదవ స్థానంలో ఉన్నారని సమాచారం.
also read: