Home » వావ్.. చిరుతలా పరుగెత్తి.. డైవ్ చేస్తూ గాలిలో ఇషాన్ క్యాచ్..!

వావ్.. చిరుతలా పరుగెత్తి.. డైవ్ చేస్తూ గాలిలో ఇషాన్ క్యాచ్..!

by Anji
Ad

సాధారణంగా టీ 20 క్రికెట్ మ్యాచ్ లో సిక్స్ లు, ఫోర్ల వర్షం కురుస్తుంటుంది. అదేవిధంగా అందులో అద్బుతమైన క్యాచ్ లు కూడా ఉంటాయి. తాజాగా భారత్, శ్రీలంక మధ్య టీ20 మ్యాచ్ జరిగింది.ఇక మ్యాచ్ లో టీమిండియా కేవలం 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో దీపక్ హుడా, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేదు. బౌలర్లు మాత్రం కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ.. వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో భారత్ ని విజయం వరించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవడానికి ఆటగాళ్ల ఫీల్డింగ్ కూడా ప్రధాన కారణం అనే చెప్పవచ్చు.

Advertisement

ముఖ్యంగా యంగ్ సెన్సేషన్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ చిరుత పులిలా కదులుతూ పట్టిన అద్భుతమైన క్యాచ్ ఈ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది. శ్రీలంక  ఇన్నింగ్స్ లో 8వ ఓవర్ లో భారత బౌలర్ ఉమ్రాన్ వేసిన బంతిని చరిత్ అసలంక భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఎడ్జ్ తీసుకోవడంతో బంతి గాలిలో ఫైన్ లెగ్ వైపునకు వెళ్లింది. అప్పటికే అక్కడ ఉన్న హర్షల్ పటేల్ క్యాచ్ పట్టేందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంతకుముందే కీపర్ ఇషాన్ కిషన్ చిరుతలా పరుగెత్తాడు. హర్షల్ ని ఆగిపోమ్మని సైగ చేసాడు. గాలిలోకి డైవ్ చేస్తూ.. అద్భుతంగా బంతిని అందుకున్నాడు. దీంతో అసలంక 12 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కి చేరుకున్నాడు. ఇదిలా ఉంటే.. కిషన్ క్యాచ్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మ్యాచ్ అయితే ఇషాన్ ఫీట్ ని చూసి కెప్టెన్ హార్దిక్ కూడా నమ్మలేకపోయాడు. ఇక నవ్వుతూ అలాగే ఉండిపోయాడు. ఇషాన్ కిషన్ అందుకున్న అద్భుతమైన క్యాచ్ ని చూసి  పలువురు ప్రశంసలు తెలుపుతున్నారు. 

Advertisement

Also Read :   Punarnavi : అనారోగ్యానికి గురైన మరో హీరోయిన్‌.. ఊపిరితిత్తుల సమస్యతో..

ఈ మధ్యకాలంలో వికెట్ కీపర్ పట్టిన అత్యుత్తమ క్యాచ్ ఇదే అని భారత మాజీ క్రికెటర్ ఇర్పాన్ పఠాన్ ఓ ట్వీట్ చేసాడు. అదేవిధంగా  ‘మాజీ భారత కెప్టెన్  మహేంద్ర సింగ్ ధోనిని గుర్తు చేశావు’ అంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ వైపు వికెట్ కీపర్ గా వికెట్ల వెనుక అద్భుతం సృష్టించిన ఇషాన్ బ్యాటింగ్ లో కూడా రాణించాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలో శ్రీలంక బౌలర్లను చీల్చి చెండాడి పరుగుల వర్షం కురిపించాడు. దీపక్ హుడా తరువాత ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ (37)దే అత్యధిక స్కోరు. 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు సాయంతో ఈ స్కోరు సాధించాడు. దీపక్ హుడా అజేయంగా 41 పరుగులు చేసాడు. ఇక అదే సమయంలో అక్షర్ పటేల్ కూడా 31 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు.  కెప్టెన్ హార్దిక్ పాండ్యా 29 పరుగులు చేశాడు. వీరు తప్ప మిగతా భారత బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేదు. శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. శ్రీలంకతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్ జనవరి 05, గురువారం పూణే వేదికగా  జరుగనుంది.

Also Read :  రిషబ్ పంత్ కోసం బాలీవుడ్ బ్యూటీ పూజలు !

Visitors Are Also Reading