ప్రేమ అంటే ఏమిటి అంటే అంటే ఒక్కొక్కరూ ఒక అర్థం చెప్పారు. ప్రేమ గుడ్డిదని కొందరు.. మంచి, చెడు,వయస్సు, రంగు, కులం ఇలా వేటితోనూ ప్రేమకు సంబంధం లేదని కొందరంటుంటారు.అయితే విదేశాల్లో మాత్రం ప్రేమకు జెండర్‌తో కూడా సంబంధం లేదు. అక్కడ అమ్మాయి, అమ్మాయిని.. అబ్బాయిని అబ్బాయి ప్రేమించవచ్చు. ఆ ప్రేమ మరింత ఎక్కువ అయితే.. జీవితాంతం కలిసి ఉండడానికి పెళ్లి కూడా చేసుకోవచ్చు. అక్కడ ఇలాంటి పెళ్లిళ్లు సర్వసాధారణం కూడా. అయితే మనదేశంలో ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతి అడుగులు పెడుతోంది.
Advertisement
తాజాగా ఇద్దరు పురుషులు ప్రేమించి పెద్ద అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. తెలంగాణలో పెళ్లి చేసుకున్న మొదటి గే జంటగా రికార్డు సృష్టించారు.ఇద్దరు మగవాళ్లు పెళ్లి చేసుకున్నా లేదా ఇద్దరు ఆడవాళ్లు పెళ్లి చేసుకున్న సంఘటనలు బారత్‌లో బహు అరుదు. మన తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు ఇలాంటివి జరిగిన దాఖలాలు లేవు. మొదటిసారిగా తెలంగాణలో ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకున్నారు. ఎనిమిదేళ్ల క్రితం డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిన సుప్రియో, అభయ్‌ల స్నేహం ప్రేమగా మారింది.
Advertisement
ఇప్పుడు పెద్దల అనుమతితో అంగరంగ వైభవంగా పెళ్లి కూడా చేసుకున్నారు. సుప్రీయో హైదరాబాద్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ స్కూల్‌లో లెక్చరర్‌గా పని చేస్తుంటాడు. అదేవిధంగా.. అభయ్ సాప్ట్‌వేర్ కంపెనీలో డెవలప్‌గా పని చేస్తున్నాడు. తెలంగాణలో ఇద్దరు స్వలింగ సంపర్కులు చేసుకున్న తొలి వివాహం ఇదే. ఈ వివాహ వేడుక సంప్రదాయ బద్ధంగా మంగళస్నానాలు, సంగీత్ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. వికారాబాద్ హైవేలోని ట్రాన్స్ గ్రీన్‌ఫీల్డ్ రిసార్ట్‌లో జరిగిన తెలంగాన తొలి స్వలింగ సంపర్కుల వివాహ వేడుక కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. అందరి సమోంలో సుప్రియో, అభయ్‌లు ఒక్కటయ్యారు.