అందాలతార నయనతార నాలుగు నెలల క్రితం కోలీవుడ్ దర్శకుడు విఘ్నేశ్ శివణ్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు నయనతార శింబుతో ప్రేమాయణం నడిపించింది. తమిళ స్టార్ హీరో శింబుతో చాలా కాలం పాటు నయనతార డేటింగ్ లో ఉంది. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో శింబుతో విడిపోయింది. అయితే ఆ తర్వాత ఎక్కువ కాలం గడవక ముందే ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో నయనతార ప్రేమలో పడిపోయింది. చాలా కాలం పాటు వీరిద్దరూ ప్రేమించుకున్నారు.
Advertisement
అంతేకాకుండా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామంటూ ప్రకటించారు. ప్రభుదేవా తన భార్యకు విడాకులు ఇచ్చి మరీ నయనతారను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో ఏం జరిగిందో కానీ ఇద్దరూ విడిపోయారు. ఇలా ఏదో ఒక వ్యవహారంతో నయనతార వరుసగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. అయినప్పటికీ సినిమాల విషయంలో మాత్రం వరుస సూపర్ హిట్ లు అందుకుని సక్సెస్ అయ్యారు.
Advertisement
ఇక రీసెంట్ గా విగ్నేష్ శివణ్ ను పెళ్లి చేసుకున్న నయనతార మరోసారి వార్తలో హాట్ టాపిక్ గా మారారు. పెళ్లి చేసుకుని ఏడాది గడవకముందే నయనతార విగ్నేష్ శివణ్ దంపతులు కవలలకు జన్మనిచ్చినట్టు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పెళ్లైన 4 నెలలకే నయనతార విగ్నేష్ శివన్ తమ పిల్లల ఫోటోలను షేర్ చేయడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే పెళ్లి తర్వాత ఐదేళ్లు పూర్తయిన తరవాత ఏమైనా సమస్యల కారణంగా పిల్లలు పుట్టే అవకాశం లేకపోతే మాత్రమే సరోగసి ద్వారా పిల్లలను కనాలని ప్రభుత్వం ఆదేశించింది.
కానీ నయనతార దంపతులు నాలుగు నెలలకే కవల పిల్లలకు జన్మనివ్వడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం ఈ విషయంపై విచారణ జరుగుతుంది. అయితే ఈ ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. నయనతార ఆరేళ్ల క్రితమే తాను విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్నట్టు అధికారులకు ఆధారాలు చూపించింది. చట్టప్రకారం సరోగసి విధానం ద్వారా తల్లిదండ్రులు కావాలంటే ఐదేళ్లు పూర్తి కావాలి. దాంతో నయనతార ఆరేళ్ల క్రితమే తాము పెళ్లి చేసుకున్నట్టు త్రిసభ్య కమిటీకి అఫిడవిట్ ను అందజేసింది.