వేణు స్వామి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సెలబ్రిటీల జాతకాలు చెప్తూ వేణు స్వామి పాపులర్ అయిపోయారు. తెలుగు మీడియాని బాగా ఫాలో అయ్యే వాళ్ళకి వేణు స్వామి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సామాన్య స్థాయి నుండి ఆయన ఇంత పాపులారిటీని తెచ్చుకున్నారు. సమంత నాగచైతన్య విడిపోతారని వేణు స్వామి ముందే చెప్పారు. అప్పటినుండి కూడా వేణు స్వామి పాపులారిటీ పెరిగిపోయింది. వేణు స్వామి ప్రధాని నరేంద్ర మోడీతో దిగిన ఫోటో అప్పట్లో వైరల్ అయింది కూడా. కొంతమంది మిత్రులతో కలిసి సమాచార హక్కు చట్టం ద్వారా మోడీని వేణు స్వామి కలిసారా..? ఫోటో దిగారా అనే వివరాలు చెప్పమని అంటే పీఎంఓ కార్యాలయం అలాంటిదేమీ లేదని ఆన్సర్ ఇచ్చినట్లు మూర్తి అన్నారు.
Advertisement
Advertisement
ఫోటో ఎక్కడిది అని సాంకేతిక సాయంతో చూస్తే.. అది అస్సాం ముఖ్యమంత్రి తో దిగినట్లుగా తెలిసిందని మూర్తి అన్నారు. సీఎం ముఖాన్ని తీసేసి ఆ ప్లేస్లో మోడీ ముఖాన్ని పెట్టి మార్ఫింగ్ చేసినట్లు తెలిసింది తర్వాత వేణు స్వామిని లైవ్ లోకి తీసుకుని వచ్చి ప్రశ్నించగా తాను కూడా కలవలేదని ఒప్పుకున్నట్లు మూర్తి చెప్పారు. ప్రధాని ఫోటోని ప్రచారానికి వాడుకోవడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతున్నాయని ఉద్దేశంతో లైవ్ షో చేశానని ఆయన వెల్లడించారు. ప్రధానమంత్రి వేణు స్వామిని కలిశారంటే దేశంలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా పరిగెడతారని పీఎం ని ప్రచారానికి వాడడం కరెక్ట్ కాదు అన్నది నా ఉద్దేశమని మూర్తి అన్నారు.
బిగ్బాస్ కౌశల్ అభిమానులు కౌశల్ ఆర్మీ పేరిట చేసిన ఓవరాక్షన్ కూడా ఎండగట్టినట్లు చెప్పారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్లని కుటుంబ సభ్యుల్ని చాలా రకాలుగా వేధించారని మూర్తి గుర్తు చేశారు. బిగ్ బాస్ విన్నర్ అయినందుకు ప్రధాని స్వయంగా అభినందించినట్లు కౌశల్ చెప్పుకునేవారని దీంతో తాను లైవ్ లో ప్రశ్నించానని మూర్తి చెప్పారు. ఏ నెంబర్ నుండి ఫోన్ వచ్చిందో తెలుసుకుని అందుకు కాల్ చేయగా అవతలి వైపున ఒక తెలుగు వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసాడని అతను కూడా జర్నలిస్ట్ అని ఢిల్లీ ఏపీ భవన్ లో పనిచేస్తాడని చెప్పినట్లు మూర్తి అన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!