Home » తులసి సీడ్స్ తో మలబద్దకం సమస్య కి చెక్..!

తులసి సీడ్స్ తో మలబద్దకం సమస్య కి చెక్..!

by Sravya
Ad

ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్కని పూజిస్తే లక్ష్మీదేవి మన ఇంట కొలువై ఉంటుంది అయితే తులసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలుసు కానీ తులసి విత్తనాలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చాలామందికి తెలియదు. తులసిలో ఆయుర్వేద గుణాలు ఉంటాయి అందుకే మందుల్లో కూడా వాడతారు. అయితే ఆరోగ్యానికి ఎలా అయితే అవిసె గింజలు సబ్జా గింజలు వంటివి పనిచేస్తాయి అలానే తులసి గింజలు కూడా పనిచేస్తాయి తులసి గింజల్ని చాలామంది రోజు తీసుకుంటున్నారు.

Tulasi

Advertisement

ఉదయం పాలల్లో తులసి గింజలు వేసుకుని తీసుకోవడం వలన బరువు తగ్గొచ్చు. ఒక గ్లాసు నీళ్లలో తులసి గింజలు వేసుకుని కొంచెం నిమ్మరసం కలుపుకొని ఆ నీటిని తాగేస్తే బరువు తగ్గడానికి అవుతుంది. కూరగాయల విత్తనాలు లాగే తులసి గింజల్లో కూడా ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. శరీరానికి అవసరమైన పోషకాలు ఖనిజాలని ఇది కలిగి ఉంది. జలుబు, దగ్గు వచ్చినప్పుడు చాలామంది తులసి ఆకులని తీసుకుంటూ ఉంటారు. గోరువెచ్చని నీటిని తీసుకుని తులసి ఆకులు, తేనె వేసుకుని తీసుకుంటే చాలా సమస్యలు పోతాయి. తులసి ఆకుల్ని నీటిలో వేసి మరిగించుకుని తీసుకుంటే, తల పట్టేయడం వంటి బాధల నుండి బయటపడవచ్చు.

Advertisement

కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది. బరువు తగ్గడానికి కూడా ఈ గింజలు చాలా చక్కగా పనిచేస్తాయి. బరువు తగ్గడానికి చాలామంది వ్యాయామ పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. పైగా డైట్ కూడా కంట్రోల్ లో తీసుకుంటూ ఉంటారు. మీరు కూడా బరువు తగ్గడానికి సతమతమవుతుంటే కచ్చితంగా తులసి గింజలని తీసుకోండి. తులసి గింజల్ని తీసుకుంటే మలబద్ధకం సమస్య నుండి కూడా బయటపడొచ్చు. జీర్ణం బాగా అవుతుంది. క్రమం తప్పకుండా తులసి గింజలను తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా మారుతుంది. రోజు తులసి గింజల్ని తీసుకోవడం వలన మహిళల పీరియడ్ సమయంలో కడుపునొప్పి రాదు.

Also read:

Visitors Are Also Reading