తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది ఎగ్జామ్స్ రాయనున్న ఇంటర్ స్టూడెంట్స్ కు ఉన్నత విద్యా మండలి గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఎంసెట్ సిలబస్ ను తగ్గించింది. ఈసారి ఎంసెట్ ఇంటర్ ఫస్టియర్ లోని కేవలం 70% సిలబస్ నుంచే ప్రశ్నలు వస్తాయని తెలియజేసింది. సెకండ్ ఇయర్ లో మాత్రం 100% సిలబస్ ప్రశ్నలు ఉంటాయని ఇంటర్ బోర్డు చెప్పింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్. లింబాద్రి తెలియజేశారు. ప్రస్తుతం ఎంసెట్ రాయబోయే విద్యార్థులు 2021-2022 ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాశారు.
Advertisement
Advertisement
కరోనా వైరస్ కారణంగా ఆ సమయంలో 70% సిలబస్ తోనే వార్షిక పరీక్షలు నిర్వహించారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు కలగకుండా ఈసారి ఎంసెట్ లో కూడా మొదటి సంవత్సరం సిలబస్ ఉంటుందని బోర్డు తెలియజేసింది. ఈ విధంగా ఇంటర్ బోర్డు తీసుకునే నిర్ణయంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పరీక్షల కాలం మొదలైంది. వివిధ ప్రొఫెషనల్ కోర్సులు అడ్మిషన్లకు సంబంధించిన ఎంసెట్, ఎడ్ సెట్, ఐసెట్, లా సెట్, పీజీఈ సెట్ తదితర అన్ని పరీక్షల తేదీలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి విడుదల చేశారు.
ఎంసెట్ 2023 :
రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ నిర్వహణ బాధ్యతను ఉన్నత విద్యా మండలి జేఎన్టీయూహెచ్ కు అప్పగించింది. ఇంజనీరింగ్ కు సంబంధించిన ఎగ్జాంను మే 7 నుంచి 11 వరకు .. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎగ్జామ్ ను మే 12 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు.
also read: