Home » “మ మ మహేషా” పాటను తమన్ అక్కడ నుండి కాపీ కొట్టారా…మక్కీ టూ మక్కీ దింపేసాడు అంటూ దారుణమైన ట్రోల్స్….!

“మ మ మహేషా” పాటను తమన్ అక్కడ నుండి కాపీ కొట్టారా…మక్కీ టూ మక్కీ దింపేసాడు అంటూ దారుణమైన ట్రోల్స్….!

by AJAY
Published: Last Updated on
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. అంతేకాకుండా ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూర్చారు. ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో ఈ చిత్రం నుండి ఒక్కో పాటను వదులుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన కళావతి పాట యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.

thaman-copied-tunes

thaman-copied-tunes

 

ఇక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తోంది. అదే విధంగా తాజాగా ఈ సినిమా నుండి మ మ మహేషా అనే పాటను కూడా విడుదల చేశారు. ఈ పాట కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతే కాకుండా ఈ పాట పై ఇప్పుడు నెట్టింట ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఈ పాటను తమన్ ఓ సూపర్ హిట్ సాంగ్ నుండి కాపీ చేశారంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. అంతే కాకుండా తమన్ స్వరాలు సమకూర్చిన రేసుగుర్రం సినిమా లోని “బ్లాకు బస్టర్ బ్లాకు బస్టరే” అంటూ సాగే పాట నుండే మ మ మహేష్ పాటను కాపీ చేశారంటూ అభిప్రాయపడుతున్నారు.

Advertisement

ఆ పాట మ్యూజిక్ ఈ పాట మ్యూజిక్ అచ్చం ఒకేలా ఉండటం వల్లనే నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. అంతే కాకుండా తమన్ ఈ పాటను అక్కడే లేపాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా తమన్ స్వరాలు సమకూరుస్తున్న ప్రతి సినిమాలోని పాటలకు ఇంతకుముందు చేసిన సినిమాలలోని పాటలకు దగ్గరి పోలికలు కనిపించడంతో కొంత కాలంగా ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తమన్ మాత్రం తాను ఈ ట్రోల్స్ ను పట్టించుకోనని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరోవైపు ఎన్ని ట్రోల్స్ వచ్చినా తమన్ ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలతో వరుస సినిమాలకు సైన్ చేస్తూ తమన్ బిజీగా మారిపోయారు.

Also read :

“నువ్వు నాకు నచ్చావ్” సినిమాలో ఈ బ్లండర్ మిస్టేక్ ను గమనించారా….!

Visitors Are Also Reading