Home » జబర్దస్త్ జడ్జీగా రోజా రీఎంట్రీ.. ఇదే దిక్కు అంటూ ట్రోలింగ్..!

జబర్దస్త్ జడ్జీగా రోజా రీఎంట్రీ.. ఇదే దిక్కు అంటూ ట్రోలింగ్..!

by Sravanthi
Ad

ఎన్నికల ఫలితాలు చూసి అందరూ షాక్ అయ్యారు ఒక్కసారిగా ఎన్నికలతో వైసీపీ మీద నెగెటివిటీ బయటకు కనపడింది. జబర్దస్త్కు రోజా రీఎంట్రీ ఇస్తారా అని వార్తలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. జబర్దస్త్ స్టార్టింగ్ లో జడ్జ్ లుగా రోజా, నాగబాబు వచ్చారు. నాగబాబు షో నుండి బయటికి వచ్చాక రోజా షో ని భుజాన్ని వేసుకుని నడిపించారు. గత ఎన్నికల్లో ఆమె మంత్రిగా మారాక పూర్తిగా జబర్దస్త్ ని వదిలెళ్ళిపోయారు. అలా వెళ్ళిన రోజా మళ్లీ జబర్దస్త్ లోకి రాలేదు. అయితే ఇప్పుడు ఏపీ ఫలితాల్లో రోజా ఓడిపోయారు.

Advertisement

నగరిలో ఆమె ఓట్లను కోల్పోయారు తమ పరాజయం ముందే తెలిసి ఆమె మల్లెమాలతో ముందే మాట్లాడుకుని ఉండచ్చని అందరూ అంటున్నారు. ఈ మధ్య జబర్దస్త్ లో మార్పులు వచ్చాయి. జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ కలిపి మళ్ళీ ఒకటే జబర్దస్త్ గా మార్చేశారు టీమ్స్ ని తగ్గించేసారు. ముఖ్యంగా ఇంద్రజ ముందే తన జడ్జి పదవి నుండి తప్పుకున్నారు గత వారం ఎందరో జబర్దస్త్ ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. దానికి కారణం రోజా అయి ఉండచ్చు అని అందరూ అంటున్నారు. మళ్ళీ తిరిగి ఆమె వస్తుందని తెలియడంతో మర్యాదపూర్వకంగా ఇంద్రజా వెళ్లిపోయినట్లు సమాచారం.

Advertisement

Also read:

minister-roja

గతంలో ఇంద్రజ ఈ మాటను చెప్పుకొచ్చారు. ఈ స్థానం రోజాది. ఎప్పుడు ఆమె వస్తే అప్పుడు నేను ఆనందంగా తప్పుకుంటానని అన్నారు. జబర్దస్త్ లో ఉన్న వాళ్ళందరూ జనసేనకు సపోర్ట్ గా ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ ని గెలిపిస్తామని పోరాడారు. ఆ సమయంలో రోజా జబర్దస్త్ వాళ్ల మీద విరుచుకుపడ్డారు. కమెడియన్స్ కూడా రోజా మాటలకు కౌంటర్లు విసిరారు. ఇప్పుడు జబర్దస్త్ కు రోజా మళ్లీ వస్తారో లేదో చూడాల్సి వస్తుంది.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading