మెగాడాటర్ నిహారిక తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తోంది. మెగాఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలుగా పరిచయమయ్యారు కానీ నిహారిక మాత్రం నటిగా ఎంట్రీ ఇచ్చింది. మొదట నిహారిక యాంకర్ గా ఢీ షోతో సక్సెస్ ను అందుకుంది. ఈ షోలో నిహారిక హోస్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తరవాత వెబ్ సిరీస్ లలో నటించిన నిహారిక ఆ తరవాత హీరోయిన్ గా పరిచయం అయ్యింది. కానీ హీరోయిన్ గా ఒక్క సినిమా కూడా హిట్ అవ్వకపోవడంతో గుడ్ బై చెప్పేసింది. ఇక నిహారిక చైతన్య జొన్నగడ్డలను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
వివాహం తరవాత చాలా కాలం వరకూ అంతా బాగానే ఉంది. కానీ నిహారిక ఇటీవల అర్దరాత్రి దాటిన తరవాత ఓ పబ్ లో ఉండటం…అదే పబ్ లో డ్ర* ఆనవాళ్లు సైతం ఉండటంతో సంచలనంగా మారింది. నిహారిక కు ఈ కేసులో డ్ర* తో ఎలాంటి సంబంధం లేకపోయినా అర్దరాత్రి దాటిన తరవాత పబ్ లో ఉండటంతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అప్పటి నుండి నిహారికకు బ్యాడ్ టైమ్ మొదలైంది. నిహారిక తన భర్త తో కూడా విడాకులు తీసుకుంటోందని వార్తలు వచ్చాయి.
Advertisement
నిహారిక చేసిన పనికి మెగాఫ్యామిలీ ఆమెపై ఆంక్షలు విధించిందని బయటకు వెళ్లనివ్వడం లేదని కూడా వార్తలు మొదలయ్యాయి. ఆ వార్తలకు చెక్ పెడుతూ నిహారిక సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చింది. తరచూ తన ఫోటోలు వీడియోలు షేర్ చేయడం మొదలుపెట్టింది. ఇక ఇటీవల నిహారిక తన భర్తతో కలిసి జోర్దాన్ ట్రిప్ కు వెళ్లింది.
అక్కడ తన భర్తతో కలిసి దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ట్రోల్స్ మొదలయ్యాయి. దానికి కారణం నిహారిక తన భర్తకు లిప్ కిస్ ఇస్తున్న ఫోటోను షేర్ చేసింది. ఎప్పటికీ విడిపోని బంధం అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దాంతో నెటిజన్లు నిహారిక పై మరోసారి రెచ్చిపోతున్నారు. నిహారిక మెగాఫ్యామిలీ పరువు తీస్తోందని కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి పోస్ట్ లు పెట్టడం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.