Home » త్రివిక్రమ్ డైరెక్షన్లో సునీల్ హీరోగా రావాల్సిన ఆ సినిమా మిస్ అయ్యిందా? ఈ టైటిల్ చూస్తే నవ్వాగదుగా!

త్రివిక్రమ్ డైరెక్షన్లో సునీల్ హీరోగా రావాల్సిన ఆ సినిమా మిస్ అయ్యిందా? ఈ టైటిల్ చూస్తే నవ్వాగదుగా!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టార్ కమెడియన్ సునీల్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి ఇండస్ట్రీ మొత్తానికీ తెలుసు. వీరిద్దరూ దాదాపు ఒకేసారి ఇండస్ట్రీ లోకి వచ్చారు. ఒకేసారి పాపులర్ అయ్యారు. సునీల్ మొదటిసారిగా అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి సినిమాలో నటించారు. అయితే.. సునీల్ కు పాపులారిటీ తెచ్చిన సినిమా మాత్రం చిరునవ్వుతో, నువ్వే కావాలి.

sunil

Advertisement

 

ఈ రెండు సినిమాలకు రైటర్ త్రివిక్రమ్. ఈ రెండు సినిమాలతో వీరిద్దరూ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఆ తరువాత త్రివిక్రమ్ రాసిన చాలా సినిమాల్లో సునీల్ కూడా నటిస్తూ వచ్చారు. అయితే.. సినిమాల్లోకి రాకముందు వీరిద్దరూ చాలా ఇబ్బందులని ఎదుర్కొన్నారు. ఒకే రూమ్ లో రెంట్ కి ఉంటూ.. అవకాశాల కోసం కాళ్ళు అరిగేలా తిరిగేవారు. త్రివిక్రమ్ కు అవకాశాలు వచ్చాక సునీల్ కి కూడా తన సినిమాల్లో పాత్రలు ఉండేలా చూసుకున్నాడు. అయితే.. త్రివిక్రమ్ డైరెక్షన్ లో సునీల్ హీరోగా ఓ సినిమా రావాల్సి ఉంది.

Advertisement

అసలు సునీల్ హీరో గా కంటే ముందు కమెడియన్ గా పాపులర్ అయ్యారు. త్రివిక్రమ్ తన ప్రతి సినిమాలోనూ సునీల్ కు ఓ రోల్ రాసేవారు. ఇక చిరంజీవి కూడా తన సినిమాల్లో సునీల్ ఉండాలని ప్రత్యేకంగా అడిగేవారట. సునీల్ అంతలా పాపులర్ అయ్యారు. త్రివిక్రమ్ సినిమాల్లో సునీల్ లేకుండా ఉండేవారు కాదు. హీరోగా కూడా సక్సెస్ అవ్వడానికి సునీల్ ప్రయత్నాలు స్టార్ట్ చేసారు. అలా.. ఓసారి సునీల్ హీరో గా “బంతి” అనే టైటిల్ తో త్రివిక్రమ్ ఓ సినిమాను తీయాలని ప్లాన్ చేసుకున్నారట. త్రివిక్రమ్ ఎన్నిసార్లు అనుకున్నారో.. కానీ, ఉన్నట్లుండి సునీల్ కు ఫ్లాప్స్ రావడం, హీరోగా అవకాశాలు తగ్గడం.. జరిగింది. ఈ టైం లో నిజంగా త్రివిక్రమ్ ఈ సినిమా తీసి ఉంటె సునీల్ హీరో గా ఫామ్ లోకి వచ్చి ఉండేవాడేమో. సునీల్ కి ఇచ్చిన మాటని త్రివిక్రమ్ తప్పదు. బంతి ఏమైందో తెలియదు కానీ, త్రివిక్రమ్ తన సినిమాల్లో సునీల్ కి క్యారెక్టర్స్ రాస్తూనే ఉన్నారు. ప్రస్తుతం సునీల్ బాగానే నిలదొక్కుకుంటారు కానీ, ఈ బంతి సినిమా మాత్రం ఉండకపోవచ్చేమో.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading