Home » త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అవుతుందా..?

త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అవుతుందా..?

by Azhar
Ad

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉంటాడు. అయితే ప్రస్తుతం వరుస హిస్ తో త్రివిక్రమ్ మంచి దూకుడుగా ఉన్నాడు అనే చెప్పాలి. అయితే త్రివిక్రమ్ చివరి సినిమా విడుదలై రెండేళ్లు దాటిపోయింది. చివరగా 2020 లో సంక్రాంతికి త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా నడిచిన అలా వైకుంఠపురములో సినిమా వచ్చింది. అది సూపర్ హిట్ అయిన.. ఇప్పటివరకు మరో సినిమా రాలేదు.

Advertisement

కానీ ప్రస్తుతం స్పెర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు అనే విషయం తెలిసిందే. ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ అనేది తొందరలోనే ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమా అనేది ఇప్పటికే చాలా ఆలస్యం అయిన విషయం అందరికి తెలిసిందే. అయిన కూడా త్రివిక్రమ్ ఓ మాస్టర్ ప్లే వేసినట్లు తెలుస్తుంది. మహేష్ తో సినిమాను వీలైనంత తొందరగా తీయాలని అని అనుకుంటున్నాడట.

Advertisement

ఎందుకంటే.. ఆ తర్వాత తన కొత్త సినిమాను అల్లు అర్జున్ తో ప్లాన్ చేసాడు త్రివిక్రమ్. మహేష్ తో సినిమా పూర్తి అయ్యేలోపు అల్లు అర్జున్ పుష్ప 2 ను పూర్తి చేసుకొని.. వీరిద్దరూ కలిసి కొత్త సినిమాను ప్రారంభించాలని చుస్తున్నారు. ఇక ఆ సినిమాను 2024 సంక్రాంతికి విడుదల చెయ్యాలి అని త్రివిక్రమ్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. కానీ ఇది అనుకున్న విధంగా వర్కౌట్ అవుతుందా లేదా అనేదే తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి :

కోహ్లీకి వ్యతిరేకంగా మరోసారి బీసీసీఐ..!

ట్రోల్స్ ను చూసి నవ్వుకుంటున్న అర్ష్‌దీప్..!

Visitors Are Also Reading