తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ దర్శకుల్లో ఒకరు అయినటువంటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన తన సినీ కెరియర్లో మొదట కథా రచయితగా… మాటల రచయితగా ఎన్నో సినిమాలకు పని చేశాడు. వాటి ద్వారా ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తరువాత తరుణ్ హీరోగా శ్రేయ హీరోయిన్గా రూపొందినటువంటి నువ్వే నువ్వే మూవీకి మొదటిసారి దర్శకత్వం వహించాడు.
Advertisement
ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఆ తర్వాత నుండి ఈయన వరుసగా సినిమాలకు దర్శకత్వం వహిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటివరకు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన సినిమాలలో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను సాధించాయి. అలా త్రివిక్రమ్ కెరియర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన సినిమాలలో అత్తారింటికి దారేది మూవీ ఒకటి. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించగా… సమంత… ప్రణీత హీరోయిన్లుగా నటించారు.
Advertisement
దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ థియేటర్లలో విడుదల కాకముందే HD క్వాలిటీ ప్రింట్ లీక్ అయ్యింది. దానితో హడావిడిగా ఈ సినిమాను విడుదల చేశారు. అంతలా ఈ సినిమా HD క్వాలిటీ ప్రింట్ లీక్ అయినప్పటికీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే త్రివిక్రమ్ ఈ కథను పవన్ కోసం కాకుండా మరో స్టార్ హీరో కోసం రాసుకున్నాడట. కాకపోతే అనుకోని కారణాలవల్ల ఈ మూవీని పవన్ తో చేయవలసి వచ్చింది అంట. ఆ హీరో ఎవరు..? ఆ కారణాలు ఏమిటో తెలుసుకుందాం. త్రివిక్రమ్ ఈ సినిమా కథను మహేష్ కోసం రాసుకున్నాడట.
ఆయనతోనే చేయాలి అనుకున్నాడట. కాకపోతే పవన్ “కెమెరామెన్ గంగతో రాంబాబు” మూవీ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయాలని భావించి… కేవలం ఆయన ఒక్క మూవీ కోసమే సమయాన్ని మొత్తం కేటాయించాడట. దానితో త్రివిక్రమ్ దగ్గర అప్పటివరకు ఏ కథ కూడా సిద్ధంగా లేకపోవడంతో పవన్ తో ఈ మూవీని రూపొందించాడట. అలా మహేష్ కోసం రాసుకున్న కథను పవన్ తో మూవీని రూపొందించిన త్రివిక్రమ్ ఈ మూవీతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు.