Home » సినిమా ఇండ‌స్ట్రీని వీడ‌ని విషాదాలు..!

సినిమా ఇండ‌స్ట్రీని వీడ‌ని విషాదాలు..!

by Bunty
Ad

కాల‌చక్రం క్ర‌మంగా తిరుగుతోంది. ముఖ్యంగా సినీ ప‌రిశ్ర‌మ‌కు ఈ ఏడాది కోలుకోలేని దెబ్బ తగిలింది. సెకండ్ వేవ్ క‌రోనాలో సినిమా థియేట‌ర్లు మూత‌ప‌డ‌డంతో సినీ కార్మికులు రోడ్డున ప‌డాల్సి వ‌చ్చింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది క‌రోనా బారిన ప‌డి ప్రాణాలు కోల్పోగా.. అందులో కొంద‌రూ సినీ ప్ర‌ముఖులు కూడా ఉన్నారు. మ‌రోవైపు అనారోగ్యం కార‌ణంగా, ప్ర‌మాదాల బారిన కొంత‌మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఏడాది మ‌న‌కు దూర‌మైన వారిలో పునిత్ రాజ్‌కుమార్, సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, శివ‌శంక‌ర్ మాస్ట‌ర్‌, వివేక్ లాంటి ప్ర‌ముఖులు ఉన్నారు. ముఖ్యంగా పునిత్ రాజ్‌కుమార్‌(46), ఈ ఏడాది భార‌తీయ సినిమాను బాగా కుదిపేసిన విషాద ఘ‌ట‌న‌లో ఇది ఒక‌టి. ఆయ‌న అక‌స్మాత్తుగా గుండెపోటుతో మ‌ర‌ణించడంతో చిత్ర ప‌రిశ్ర‌మంతా శ్లోక సంద్రంలో మునిగిపోయింది.

Advertisement

 

Advertisement

మ‌రోవైపు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఈ ఏడాది అతిపెద్ద విషాదం ఏమిటంటే.. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి మ‌ర‌ణించ‌డమే.. వేలాది పాట‌ల‌కు సాహిత్యం అందించిన ఆయ‌న సాహితీ దిగ్గజం సిరివెన్నెల నవంబ‌ర్ 30న తీవ్ర అనారోగ్యంతో క‌న్నుమూసారు. ఆయ‌న రెండు ఊపిరితిత్తులు దెబ్బ‌తిన‌డంతోనే శ్వాస వ‌దిలారు. ఆరు సంవ‌త్స‌రాల క్రితమే ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ భారీన ప‌డ్డారు. తీవ్ర అనారోగ్యం పాలైన ఆయ‌న‌ను ఐదు రోజుల పాటు ఎక్మోపై ఉంచి చికిత్స అందించారు. అయినా ఆయ‌న తుదిశ్వాస వ‌దిలారు.

 

ధీర ధీర అంటూ మ‌గ‌దీర సినిమాకు అద్భుత‌మైన నృత్య‌రీతులు స‌మ‌కూర్చి.. జాతీయ అవార్డును అందుకున్నారు ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శివ‌శంక‌ర్ మాస్ట‌ర్‌. బ‌హుముఖ ప్ర‌జ్ఞాశీలిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయ‌న చెన్నైలో పుట్టి పెరిగారు. స‌లీం మాస్ట‌ర్ ద‌గ్గ‌ర శిష్య‌రికం చేసి.. 800 చిత్రాల‌కు పైగా ఢ్యాన్స్ మాస్ట‌ర్‌గా ప‌ని చేసారు. న‌టుడిగా కూడా ప‌లు చిత్రాల‌లో న‌టించారు. అదేవిధంగా కొన్ని టీవీ షోల‌కు న్యాయ‌నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రించారు. కేవ‌లం వీరే కాకుండా ఇంకా సిద్దార్థ్ శుక్లా, టీఎన్ఆర్‌, మ‌హేష్ కోనేరు, జ‌యంతి, వివేక్‌, బీ.ఏ.రాజు వంటి వారు కూడా ఈ ఏడాది మృతి చెందారు.

 

Visitors Are Also Reading