తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు చాలా చీప్ గా చూసేవారు. ఇక్కడి యాక్టర్స్ అయినా డైరెక్టర్స్ అయినా మిగతా ఇండస్ట్రీల ముందు చాలా తక్కువ చేసేవారని టాక్ ఉంది. అలాంటి ఇండస్ట్రీ రూపు రేఖలు మార్చిన ఘనత రాజమౌళికే చెల్లుతుందని చెప్పవచ్చు. తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలిసేటట్టు చేశారు. ఇక ఆస్కార్ అవార్డు రావడంతో ఈ పేరు మర్యాదలు పై స్థాయికి వెళ్ళాయని చెప్పవచ్చు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలోని డైరెక్టర్లతో యాక్టర్లతో సినిమాలు చేయడానికి ఇతర ఇండస్ట్రీల వారు చూస్తున్నారంటే టాలీవుడ్ రేంజ్ ఎక్కడికి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు.
also read:Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఖర్చులు అధికం
Advertisement
అలా సినిమా అంటే ప్రాణంగా ప్రేమించే రాజమౌళి ఆయన కుటుంబం మొత్తం సినిమా కోసం ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటారట. రాజమౌళి అన్న మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తే ఆయన భార్య శ్రీవల్లి లైన్ ప్రొడ్యూసర్ గా ఉంటారు. ఇక రాజమౌళి కొడుకు రాజమౌళి భార్య కూడా ఆయన సినిమాల్లో పని చేస్తారు.కాబట్టే ఇంతటి హిట్లు కొడుతున్నాడు. ఇదంతా పక్కన పెడితే రాజమౌళి తల్లి చిరంజీవికి దగ్గరి బంధువు అని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అది ఎలాగో చూద్దామా.. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు.ఈ విషయాన్ని ఆయన ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో చెప్పారు.
Advertisement
also read:Chanakya Niti : ఈ చిట్కాలను పాటిస్తే తప్పకుండా కోటీశ్వరులు అవుతారు
ఈ సందర్భంలో ఒక విలేఖరి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లతో సినిమా చేయడం అంటే కమ్మ కాపు ఈక్వేషన్ అని అడ్డం పెట్టుకొని భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అని ప్రశ్నించారట. ఈ ప్రశ్నకు విజయేంద్ర ప్రసాద్ సమాధానం ఇస్తూ తన కుటుంబ నేపథ్యాన్ని చెప్పుకొచ్చారు. 1966 లో తమ పెళ్ళి జరిగిందని నాది కమ్మ కులం అని నా భార్యది ఏ కులం కూడా నాకు తెలియదని అన్నారు. అయితే చిరంజీవి ఖైదీ సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం తన భార్య మా బంధువు చిరంజీవి అని చెప్పడంతో అప్పుడే కాపు కులం అనే విషయం అర్థమైందని విజయేంద్రప్రసాద్ తెలియజేశారు. ఇక తన కుటుంబంలో చాలా మందికి ప్రేమ వివాహాలు జరిగాయని, కులాల ప్రాతిపదికన మేం పట్టించుకోమని తెలియజేశారు.
also read: