Home » విడాకులు తీసుకున్న భారతీయ క్రికెటర్లు వీరే..!

విడాకులు తీసుకున్న భారతీయ క్రికెటర్లు వీరే..!

by Bunty
Ad

ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు చాలా కామన్. పెళ్లిళ్లు ఎంత సులభంగా చేసుకుంటారో విడాకులు కూడా అంతే సులభంగా తీసుకుంటున్నారు. కొందరు సెలబ్రిటీలు అయితే విడాకులు తీసుకున్న వారిని కూడా ప్రేమించి పెళ్లిళ్లు చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. పెళ్లయి పదేళ్లు అయ్యి ఆ తర్వాత విడాకులు తీసుకున్న వారిని పెళ్లిళ్లు చేసుకున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారు. భర్తలకు విడాకులు ఇచ్చిన అమ్మాయిలు, భార్యలకు విడాకులు ఇచ్చిన అబ్బాయిలు మళ్లీ వారు రెండో పెళ్లి చేసుకోవడం చాలా కామన్. ఇక ఇండస్ట్రీలోనే కాకుండా మన భారతీయ క్రికెటర్లు సైతం భర్తలకు విడాకులు ఇచ్చిన అమ్మాయిలను వివాహాలు చేసుకున్న వారు ఉన్నారు. మరి ఆ క్రికెటర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

# శిఖర్ ధావన్-అయేషా ముఖర్జీ

శిఖర్ ధావన్ 2012లో అయేషాను వివాహం చేసుకున్నాడు. అయేషా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో ఉండేది. అయేషాకు మొదట వివాహమై విడాకులు తీసుకుంది. తనకు అప్పటికే ఇద్దరు కూతుర్లు. అంతేకాకుండా ధావన్ కన్నా వయసులో చాలా పెద్దది. ఆయేషా – దావన్ కూడా విడాకులు తీసుకున్నారు.

Anil Kumble

Anil Kumble

# అనిల్ కుంబ్లే-చేతన

అనిల్ కూడా మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. చేతన అనే అమ్మాయికి మొదట వివాహమై తన భర్తతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత అనిల్ చేతనకు మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వీరిద్దరు వివాహం చేసుకున్నారు.

# మహమ్మద్ షమీ-హసీన్

Advertisement

మహమ్మద్ షమీ కూడా విడాకులు ఇచ్చిన అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నాడు. అయితే హాసిన్ కి అప్పటికే వివాహమై విడాకులు తీసుకుంది. ఇక వీరిద్దరికీ మోడలింగ్ చేసే సమయంలో పరిచయం ఏర్పడి వీరిద్దరూ 2014లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఒక బాబు జన్మించాడు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ మధ్య మనస్పర్ధలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు.

# దినేష్ కార్తీక్-నికిత వంజారా

మురళి విజయ్ వివాహం చాలా విచిత్రంగా ఉంటుంది. తన స్నేహితుడి భార్య అయిన నికితను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. నికిత మురళి చిన్నప్పటి నుంచి స్నేహితులు. స్నేహితుడు, భార్య కలిసి చేసిన మోసాన్ని తట్టుకోలేక దినేష్ కార్తీక్ విడాకులు ఇచ్చేశాడు. దీంతో మురళి నికిత వివాహం చేసుకున్నారు.

# వెంకటేష్ ప్రసాద్-జయంతి

టీమిండియా మాజీ క్రికెటర్ పేస్ బౌలర్ వెంకటేష్ సైతం తన భర్తకు విడాకులు ఇచ్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. 1996లో వెంకటేష్ జయంతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆమెకు అప్పటికే వివాహమై విడాకులు తీసుకుంది. వీరిద్దరూ మొదటనుంచి స్నేహితులు. ఆ తర్వాత స్నేహం కారణంగానే ఇద్దరు ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading