Home » ఐపీఎల్ లో బాగా సంపాదించిన భారత ఆటగాళ్లు వీళ్లే..! 

ఐపీఎల్ లో బాగా సంపాదించిన భారత ఆటగాళ్లు వీళ్లే..! 

by Azhar
Ad
బీసీసీఐ 2008 లో ప్రారంభించిన ఐపీఎల్ అనేది అన్ని రకాలుగా మంచి విజయం సాధించింది. అయితే ఈ లీగ్ కు మరో పేరు ఉంది. అదే క్యాచ్ రిచ్ లీగ్. ఆ పేరుతో ఎందుకు పిలుస్తారో అందరికి తెలిసిందే. ఇదిలా ఉంటె.. ఈ లీగ్ ద్వారా బాగా డబ్బు సంపాదించిన టాప్ 5 భారత ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
ధోని : ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుండి ఇప్పటివరకు మొత్తం 15 సీజన్లలో ఆడిన ధోని.. మొత్తం అక్షరాలా 1,648,400,000 రూపాయలు సంపాదించాడు. అయితే గత సీజన్ వరకు 15 కోట్లు తీసుకున్న… ధోనికి ఈ ఏడాది 12 మాత్రమే వస్తున్నాయి. ఐపీఎల్ 2022 సీజన్ ను ముందు చెన్నై ధోనిని 12 కోట్లకే రిటైన్ చేసుకుంది.
రోహిత్ శర్మ : ముంబై ఇండియన్స్ జట్టుకు 5 సార్లు టైటిల్ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ. ఐపీఎల్ మొదట్లో హైదరాబాద్ జట్టుకు ఆడిన రోహిత్ శర్మ.. 2011 నుండి ముంబైకి ఆడుతున్నాడు. అయితే ఐపీఎల్ ద్వారా మొత్తం రోహిత్ శర్మ 1,626,000,000 రూపాయాలు వెనుకేసుకున్నాడు.
కోహ్లీ : ఐపీఎల్ లో మొదటి సీజన్ నుండి ఒక్కే జట్టుకు ఆడుతున్న తక్కువ మంది ఆటగాళ్లలో కోహ్లీ ఒక్కడు. గత ఏడాది వరకు బెంగళూర్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న కోహ్లీ.. ఇప్పటివరకు ఐపీఎల్ లో 1,582,000,000 రూపాయాలు సంపాదించాడు.
కేఎల్ రాహుల్ : ఐపీఎల్ 2022 లో కొత్తగా వచ్చిన లక్నో జట్టుకు కెప్టెన్ గా వ్యవరిస్తున్న.. 2013 లో ఈ క్యాష్ రిచ్ లీగ్ కు ఎంట్రీ ఇచ్చాడు. అప్పటినుండి ఇప్పటివరకు రాహుల్ మొత్తం 651,000,000 రూపాయాలు సంపాదించాడు.
హార్దిక్ పాండ్య : ఫిట్నెస్ లేక భారత జట్టులో చోటు కోల్పోయిన హార్దిక్ పాండ్య ఐపీఎల్ సంపాదన కూడా బాగానే ఉంది. 2015 లో ముంబై తరపున ఐపీఎల్ లోకి వచ్చిన పాండ్య… ఈ ఏడాది గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవరిస్తున్నాడు. అయితే ఈ ఐపీఎల్ లో మొత్తం పాండ్య 593,000,000 రూపాయాలు తన ఖాతాలో వేసుకున్నాడు.

Advertisement

Visitors Are Also Reading