సినిమా పరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదగటం అనేది చాలా కష్టం. బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వెళితే ముందుగా అసిస్టెంట్ గా లేదంటే సైడ్ పాత్రలు చేస్తూ హీరో అవకాశాల కోసం ప్రయత్నాలు జరపాల్సిందే. అలా అసిస్టెంట్ డైరెక్టర్ గా సైడ్ క్యారెక్టర్ లు చేస్తూ హీరోగా ఎదిగిన వారిలో మాస్ మహరాజ్ రవితేజ ఒకరు. అందువల్లే మాస్ మహరాజ్ ను ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంటారు. ఇక ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో సక్సెస్ అయిన రవితేజ ఎంతోమంది కొత్త దర్శకులకు లైఫ్ ఇచ్చారు. అలా రవితేజ లైఫ్ ఇచ్చిన దర్శకుల్లో కొంతమంది స్టార్ డైరెక్టర్ లు గా ఎదిగారు. అలా ఎదిగిన దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం…
టాలీవుడ్ లో స్టార్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న శ్రీనువైట్ల తన మొదటి సినిమా నీకోసం ను రవితేజ హీరోగా తెరకెక్కించారు.
Advertisement
Advertisement
మాస్ దర్శకుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బోయపాటి శ్రీనును కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసింది రవితేజనే. భద్ర సినిమాతో రవితేజ శ్రీనువైట్లకు అవకాశం ఇచ్చాడు.
గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తీసిన హరీష్ శంకర్ ను కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది రవితేజనే.
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న గోపించంద్ మలినేనిని కూడా రవితేజ టాలీవుడ్ కు పరిచయం చేశాడు. వీరిద్దరి కాంబినేషన్ లో డాన్ శీను సినిమా వచ్చింది.
యంగ్ డైరెక్టర్ బాబీని కూడా పవర్ సినిమాతో రవితేజ టాలీవుడ్ కు పరిచయం చేశారు. బాబీ ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు.