చాలామంది టమాటోలను చాలా ఇష్టపడి తింటూ ఉంటారు. ఏ కర్రీలో టొమాటో వేసుకున్న అదిరిపోయే టేస్ట్ ని ఇస్తుంది.. టమాటాలో ఆరోగ్యానికి మేలు చేసే క్యాల్షియం, విటమిన్లు, పాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. టొమాటోలను లిమిట్లో తింటే ఆరోగ్యానికి మంచిదే.కానీ ఇక దొరికింది కదా అని అతిగా తింటే మాత్రం శరీరానికి అనేక తిప్పలు వస్తాయని, అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు.. మరి ఆ సమస్య ఏంటో మనము ఓ లుక్ వేద్దాం..
అతిసారం :
టమాటోలను ఎక్కువగా తీసుకోవడం వల్ల విరోచనాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు.. ఇందులో ఉండేటువంటి సాల్మొనెల్ల బ్యాక్టీరియా డయేరియా సమస్యకు దారితీస్తుందట.. కాబట్టి తక్కువ మోతాదులో టమోటాలను తినాలని అంటున్నారు..
గ్యాస్ ప్రాబ్లం :
టమాటోలను అతిగా తినడం వల్ల పొట్టలో గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఉందని, దీనివల్ల జీర్ణవ్యవస్థ దెబ్బ తినే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఈ టమాటాలకు దూరంగా ఉంటే మంచిది..
Advertisement
Advertisement
మూత్రపిండాల్లో రాళ్లు :
టమాటాలో ఆక్సలైట్ అధిక శాతం లో ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు..
కీళ్ల నొప్పులు :
చాలామందికి కీళ్ల నొప్పులు వస్తూ ఉంటాయి. ఇది కామనే కానీ, టమాటాలు ఎక్కువ తింటే కూడా కీళ్ల నొప్పులు వస్తాయని చాలామందికి తెలియదు.. ఈ నొప్పులు ఉన్నవారు శీతాకాలంలో టమాటాలకు దూరంగా ఉండడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
also read:పెళ్లికి ముందు అమ్మాయి, అబ్బాయికి మంగళ స్నానం ఎందుకు చేయిస్తారంటే..?