Tollywood villain’s remuneration: సినిమాలో హీరో క్యారెక్టర్ హైలెట్ అవ్వాలంటే అందులో విలన్ కూడా స్ట్రాంగ్ గా ఉండాల్సిందే. విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే హీరో అంత హీరోయిజం ప్రదర్శించవచ్చు. కొన్ని సినిమాలు అయితే విలన్ ల క్యారెక్టర్ ల వల్లనే సూపర్ హిట్ లుగా నిలిచాయి. హీరో అంత క్రేజ్ విలన్ కూ ఉండటంతో వాళ్లు పుచ్చుకునే రెమ్యునరేషన్ లు కూడా అదే రేంజ్ లో ఉంటున్నాయి. అలా కొంతమంది చిన్న హీరోలకంటే ఎక్కువ రెమ్యనరేషన్ తీసుకుంటున్న విలన్ లు ఎవరో ఇప్పుడు చూద్దాం….
Also Read: ఏపీ వరద బాధితులకు ప్రభాస్ రూ. 1 కోటి విరాళం..
Advertisement
లెజెండ్ సినిమాతో విలన్ గా పరిచయమైన జగపతి బాబు ఆ సినిమా తరవాత ఫుల్ బిజీ అయ్యాడు. ప్రస్తుతం జగపతి బాబు ఒక్కో సినిమాకు కోటి నుండి కోటిన్నర రెమ్యునరేషన్ ను పుచ్చుకుంటున్నాడు.
రీసెంట్ గా అఖండ సినిమాతో విలన్ గా పరిచయమైన హీరో శ్రీకాంత్. ఒక్కప్పుడు హీరోగా నటించిన శ్రీకాంత్ విలన్ గా కూడా భారీగానే పుచ్చుకుంటున్నాడు. శ్రీకాంత్ అఖండ సినిమాకు కోటి రూపాయలు తీసుకున్నట్టు టాక్.
Advertisement
విలన్ గా టాలీవుడ్ తో పాటూ ఇతర ఇండస్ట్రీలలో బిజీగా ఉన్న నటుడు ప్రకాష్ రాజ్. ఈయన ఒక్క రోజు షూటింగ్ కు పదిలక్షల వరకూ పుచ్చుకుంటాడట. కొన్ని సినిమాలకు కోటిన్నర వరకూ తీసుకుంటాడట.
Also Read: ‘అఖండ’ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా..?
రియల్ హీరో సోనూసూద్ సినిమాల్లో చేసేవి మాత్రం విలన్ పాత్రలే. సోనూ వీళ్లందరికంటే ఎక్కువే పుచ్చుకుంటారు. ఏకంగా సోనూసూద్ ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు తీసుకుంటాడట.
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ విలన్ గా నటించాలంటే ఒక్కో సినిమాకు మూడు కోట్ల రెమ్యనరేషన్ తీసుకుంటాడట.
టాలీవుడ్ యంగ్ హీరో ఆదిపినిశెట్టి కూడా విలన్ పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆదిపినిశెట్టి సరైనోడు సినిమాకు కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాడట.