ఏపీలో సినిమా టికెట్ల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టికెట్ల ధరలపై ఏపీ సర్కార్ నియంత్రణ విధించడంతో పలువురు సినీ ప్రముఖులు దీనిని వ్యతిరేఖిస్తున్నారు. ఏపీ సర్కార్ అవలంభిస్తున్న దోరణితో పెద్ద సినిమాలు నష్టపోయే అవకాశం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ ఓ మెట్టు కిందకు దిగింది. సీఎం జగన్ ఏపీ టికెట్ల అంశంపై చర్చించేందుకు చిరంజీవికి ఆహ్వానం పలికి ఇప్పటికే చర్చించారు. ఈ సమావేశం అనంతరం సీఎం జగన్ సమస్యలపై పరిష్కారినికి పాజిటివ్ గా స్పందించారని తెలిపారు.
Advertisement
అంతే కాకుండా ఓ కమిటి వేస్తామని సీఎం తెలిపారని మరోసారి మీటింగ్ ఉంటుందని చిరు పేర్కొన్నారు. ఇక చిరంజీవి చెప్పినట్టుగానే నేడు సీఎం జగన్ తో పలువురు సినీప్రముఖులు భేటీ అవుతున్నారు. ఈ రోజు ఉదయం 11గంటలకు చింరంజీవితో పాటూ హీరోలు నాగార్జున, ప్రభాస్, మహేశ్ బాబు మరియు దర్శకుడు రాజమౌళి, కొరటాల శివ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. అయితే ఇప్పటికే సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ పాజిటివ్ గా ఉన్నారని చిరు చెప్పిన నేపథ్యంలో సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
Advertisement