సినిమా హిట్టయ్యిందంటే హీరోలు రెమ్యునరేషన్ లు పెంచేస్తారు. ఒక్కసినిమాకే కాదు కానీ డిమాండ్ కు తగ్గట్టుగా మెల్లి మెల్లిగా పెంచుతారు. ఇక పదేళ్ల క్రితం టాలీవుడ్ హీరోల రెమ్యురేషన్ లు ప్రస్తుత రెమ్యునరేషన్ లు చూస్తే పదింతలు పెరిగిపోయాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ALSO READ : మెగాస్టార్ “గాడ్ ఫాదర్” లో ఆ పార్టీపేరును గుర్తించారా..!
Advertisement
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల నుండి రూ.150 కోట్లు తీసుకుంటున్నాడు. కానీ పదేళ్లక్రితం ప్రభాస్ చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ డార్లింగ్ సినిమాలకు రూ.5కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాకు రామ్ చరణ్ ఏకంగా రూ.50 కోట్ల రెమ్యునరేషన్ ను అందుకకున్నాడు. కానీ పదేళ్ల క్రితం చరణ్ హీరోగా నటించిన ఆరెంజ్ సినిమాకు రూ.6కోట్ల రెమ్యునరేషన్ ను తీసుకున్నాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ఆర్ఆర్ఆర్ సినిమాకు రూ.50 కోట్ల రెమ్యునరేషన్ ను పుచ్చుకున్నాడు. కానీ ఎన్టీఆర్ పదేళ్ల క్రితం చేసిన అదుర్స్ సినిమాకు రూ.9 కోట్ల రెమ్యునరేషన్ ను తీసుకున్నారు.
Advertisement
ప్రిన్స్ మహేశ్ బాబు దూకుడు, ఖలేజా సినిమాలకు 8 నుండి 9 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట. కానీ ఇప్పుడు ఆయన రెమ్యునరేషన్ భారీగా పెంచారు. సరిగ్గా తెలియదు కానీ రెండు డిజిట్లకు మహేశ్ బాబు రెమ్యునరేషన్ పెంచినట్టు టాక్.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జల్సా, కొమురం భీం సినిమాలకు రూ.8 నుండి 9 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట. కానీ ఇప్పుడు పవన్ ఒక్క సినిమాకే రూ.50 నుండి 75 కోట్ల వరకూ రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారు.
ALSO READ : “దర్జా”గా అనసూయ…లుక్ అదుర్స్..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పదేళ్ల క్రితం వరుడు సినిమాలో నటించాడు. ఈ సినిమాకు బన్నీ రూ.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారట.
కానీ ఇప్పుడు ఆ రెమ్యునరేషన్ ను ఏకంగా రూ.30 నుండి రూ.40 కోట్లకు పెంచారట.