Home » మెగాస్టార్ “గాడ్ ఫాద‌ర్” లో ఆ పార్టీపేరును గుర్తించారా..!

మెగాస్టార్ “గాడ్ ఫాద‌ర్” లో ఆ పార్టీపేరును గుర్తించారా..!

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల క‌రోనా బారిన‌ప‌డిన‌ సంగతి తెలిసిందే. అయితే తాజాగా తాను కోలుకున్న‌ట్టు చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అంతేకాకుండా తిరిగి తాను షూటింగ్ లో పాల్గొంటున్నాన‌ని మెగాస్టార్ తెలిపారు. తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన‌ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు. ఇక షూటింగ్ లొకేషన్ నుండి మెగాస్టార్ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

god father

god father

అయితే ఆ ఫోటోలు మెగాస్టార్ నటిస్తున్న గాడ్ ఫాద‌ర్ సినిమా షూటింగ్ స్పాట్ లోవి… ఈ సినిమా పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గ‌త కొద్ది రోజులుగా ఈ చిత్రం షూటింగ్ హైద‌రాబాద్ శివారులో జరుగుతుండ‌గా మెగాస్టార్ నేడు షూటింగ్ లో పాల్గొన్నారు.

Advertisement

god father1

Advertisement

ఈ చిత్రంలో సునీల్, బ్రహ్మాజీ, సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ స‌మ‌యంలో మోగాస్టార్ పక్కన‌ సత్యదేవ్, సునీల్, బ్రహ్మాజీ కూడా కనిపిస్తారు. అంతేకాకుండా ఈ ఫోటోలో బ్యాక్ గ్రౌండ్ లో జన జాగృతి అనే పార్టీ పేరు కనిపిస్తోంది. దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీ అని పెట్టండి సార్ అంటూ కామెంట్ పడుతున్నారు.

ALSO READ : NTR,అశ్వ‌నీద‌త్ ల మ‌ధ్య‌ ఒక రోజు సెట్ జ‌రిగిన సంఘ‌ట‌న‌!

మరికొంతమంది జనసేన పార్టీకి దగ్గర్లో ఉండాలని జన జాగృతి అని పేరుపెట్టార‌ని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో న‌య‌నతార మోగాస్టార్ కు చెల్లెలి పాత్ర‌లో న‌టిస్తున్నారు. న‌య‌న్ కూడా నిన్న‌నే సినిమా సెట్స్ లో పాల్గొన్నారు. నిజానికి మొద‌ట న‌య‌న‌తార ఈ సినిమా కోసం అడిగినప్పుడు ఆలోచ‌నలో ప‌డ్డార‌ట‌. కానీ త‌న పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉండ‌టం తో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారట‌.

Visitors Are Also Reading