ప్రస్తుత కాలంలో ప్రపంచం మొత్తం సోషల్ మీడియాలో మైఖంలో ములిగి తేలుతుంది. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు తమకు సంబంధించిన ఎన్నో విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత ఉన్న సోషల్ మీడియా ప్లోట్ఫార్మ్స్ లో ఇన్స్టాగ్రామ్ మొదటి స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. ఎంతోమంది తమకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను, వీడియోలను అప్లోడ్ చేస్తూ అధిక సంఖ్యలో ఫాలోవర్స్ ను సంపాదించుకుంటున్నారు.
Advertisement
సామాన్యులకే ఈ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంటే.. మరీ మన సినీ సెలబ్రెటీలు ఏమైనా తక్కువ తిన్నారా అంటే కాదని చెప్పుకోవాలి. మొన్నకు మొన్న పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ ఖాతా ఓపెన్ చేయగా కొన్ని గంటల వ్యవధిలోనే మిలియన్ ఫాలోవర్స్ దాటడంతో సోషల్ మీడియాలో ఇది కాస్త బాగా వైరల్ న్యూస్ అయ్యింది. మరి ఇదే తరహాలో మన టాలీవుడ్ స్టార్ హీరోస్ కి మిలియన్ ఫాలోవర్స్ పొందడానికి ఎంత టైం పట్టిందో తెలుసుకుందాం..
#1. ప్రభాస్:
బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ సోషల్ మీడియాలో చాల తక్కువగా తనకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటాడు. అయినా కూడా ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ బేస్ వల్ల కేవలం 23 రోజుల్లోనే ఒక మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు ప్రభాస్.
Advertisement
#2. రామ్ చరణ్ :
ప్రభాస్ తర్వాత అతి తక్కువ టైం లో 1 మిలియన్ ఫాలోవర్స్ దక్కించుకున్న స్టార్ హీరో రామ్ చరణ్. 74 రోజులలో వన్ మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకొని రాంచరణ్ రికార్డును సృష్టించాడు.
#3 మహేష్ బాబు :
ఇక ప్రిన్స్ మహేష్ బాబుకి వన్ మిలియన్ ఫాలోవర్స్ సంపాదించడానికి 89 రోజులు పట్టిందట.
#4. అల్లు అర్జున్ :
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నాడు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోస్ మరియు వీడియోలను అప్లోడ్ చేస్తూ అభిమానులకు సోషల్ మీడియాలో దగ్గరగా ఉండే అల్లు అర్జున్ సైతం వన్ మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకోవడానికి 184 రోజులు పట్టిందట.
#5. ఎన్టీఆర్ :
ఇక ఈ రేస్ లో జూనియర్ ఎన్టీఆర్ బాగా వెనుకున్నాడని చెప్పుకోవచ్చు. దానికి కారణం ఎన్టీఆర్ సోషల్ మీడియాను అంతగా ఫాలో అవ్వడు. మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించడానికి ఎన్టీఆర్ కి ఏకంగా దాదాపు 416 రోజులు పట్టిందట.