Home » టాలీవుడ్‌ సింగర్ గీతా మాధురి విడాకులు….అసలు వాస్తవం ఇదే!

టాలీవుడ్‌ సింగర్ గీతా మాధురి విడాకులు….అసలు వాస్తవం ఇదే!

by Bunty
Ad

సినీ ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లిళ్లు, ఆ తర్వాత కొన్ని రోజులకు విడాకులు చాలా కామన్ గా మారిపోయాయి. ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు అతి తక్కువ కాలంలోనే చిన్నచిన్న కారణాలతో విడాకులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో పాపులర్ సింగర్ అయినటువంటి గీతామాధురి, నందు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ అనేక రకాల వార్తలు వస్తున్నాయి. దానికి గల కారణం…. వీరు సోషల్ మీడియాకి కొన్ని రోజుల నుంచి దూరంగా ఉంటున్నారు.

Tollywood singer Geeta Madhuri's divorce

Tollywood singer Geeta Madhuri’s divorce

అంతే కాకుండా వీరిద్దరూ కలిసి బయట ఎక్కడ కనిపించడం లేదు. ఈ క్రమంలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ అనేక రకాల వార్తలు వస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఎన్నో రోజుల నుంచి వస్తున్న వార్తలపై నందు స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ… ఈ వార్తలను విని గీతా, నేను చాలా నవ్వుకున్నాము. మేమిద్దరం కూడా విడాకులు తీసుకుంటున్నామంటూ సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వస్తున్నాయి.

Advertisement

Advertisement

ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. మేమిద్దరం కలిసి చాలా సంతోషంగా ఉంటున్నాము. మేమిద్దరం విడాకులు తీసుకొని మా పాప భవిష్యత్తును అంధకారంలో పడేయాలని అనుకోవడం లేదు. అయినా విడాకులు తీసుకునే ఉద్దేశం కూడా మాకు లేదు. నేను, మాధురి, మా పాప ముగ్గురం చాలా సంతోషంగా ఉంటున్నాము. ఒకరికి ఒకరం సపోర్ట్ చేసుకుంటూ మా లైఫ్ ని చాలా సంతోషంగా గడుపుతున్నాము అని నందు చెప్పుకొచ్చాడు. ఇక ఈ వార్తలు విన్న తర్వాత వారి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading