Home » రీ రిలీజ్ : ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన మూవీలు ఇవే… ఇప్పటికీ అదే సినిమా టాప్..!

రీ రిలీజ్ : ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన మూవీలు ఇవే… ఇప్పటికీ అదే సినిమా టాప్..!

by AJAY
Ad

ఈ మధ్యకాలంలో వరుసగా టాలీవుడ్ టాప్ హీరోలు నటించిన సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా కొన్ని మూవీలకు రీ రిలీజ్ అయిన మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా దక్కాయి. అలా ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి రీ రిలీజ్ అయిన సినిమాలలో మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ కలెక్షన్లను వాసులు చేసిన టాప్ 9 మూవీలు ఏవో తెలుసుకుందాం.

Pawan Kalyan Kushi movie

Pawan Kalyan Kushi movie

ఖుషి : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా విడుదల అయిన మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 4.15 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. భూమిక హీరోయిన్గా నటించిన ఈ మూవీకి ఎస్ జె సూర్య దర్శకత్వం వహించాడు.

Advertisement

సింహాద్రి : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు రీ రిలీజ్ లో భాగంగా 4.01 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించారు.

జల్సా : పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు 3.20 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఇలియానా, పార్వతి మెల్టన్ హీరోయిన్లుగా నటించారు.

Advertisement

ఒక్కడు : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు 2.05 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. భూమిక హీరోయిన్గా నటించిన ఈ మూవీకి గుణశేఖర్ దర్శకత్వం వహించాడు.

పోకిరి : మహేష్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు 1.73 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. గోవా బ్యూటీ ఇలియానా ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా… డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఆరెంజ్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన ఈ సినిమా మొదటి రోజు రీ రిలీజ్ లో భాగంగా 1.53 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. జెనీలియా హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు.

దేశముదురు : అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.50 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. హన్సిక హీరోయిన్గా నటించిన ఈ మూవీకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు.

చెన్నకేశవరెడ్డి : బాలకృష్ణ హీరోగా రూపొందిన ఈ సినిమా మొదటి రోజు రీ రిలీజ్ లో భాగంగా 1.10 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో టబు, శ్రేయ హీరోయిన్లుగా నటించారు.

బిల్లా : ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమా మొదటి రోజు రీ రిలీజ్ లో భాగంగా 1.05 కోట్ల కలెక్షన్లను వాదులు చేసింది. అనుష్క హీరోయిన్గా రూపొందిన ఈ మూవీకి మెహర్ రమేష్ దర్శకత్వం వహించాడు.

Visitors Are Also Reading