సినిమా ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్స్ ఏడాదికి కోట్ల రూపాయల్లో డబ్బులు సంపాదించినా.. వారికి నచ్చిన తిండి తినడానికి ఉండదు. ఫిట్ నెస్ కోసమో.. జీరో సైజు ని మైంటైన్ చేయడం కోసమో ఫుడ్ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటారు. ప్రతి రోజు డైట్ ప్రకారమే తింటూ ఉంటారు. చాలా వరకు ఫుడ్స్ ని అవాయిడ్ చేసేస్తూ ఉంటారు. అయితే.. వారికి బాగా ఇష్టమైన ఫుడ్ ని ఒక్కోసారి ఎక్కువగానే తినేస్తూ ఉంటారు. ఆ తరువాత ఎక్కువగా వర్క్ అవుట్ చేస్తారు. అలా.. ఎంత డైట్ ఫాలో అయినా.. ఎక్కువగా లాగించేసే ఇష్టమైన ఫుడ్ ప్రతి ఒక్క సెలెబ్రిటీకి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.
Advertisement
ఎక్కువ తింటే లావైపోతారు అన్న ఉద్దేశ్యంతో సినీ ఇండస్ట్రీకి చెందిన వారు మితంగానే తింటుంటారు. కొందరు అన్ని ఫుడ్ ఐటమ్స్ తిన్నా.. వర్క్ ఔట్స్ చేస్తూ ఫిట్ గా ఉంటారు. మరి కొందరేమో డైట్ చేస్తూ ఫిట్ గా ఉంటారు. టాలీవుడ్ నటుల్లో ఎవరికీ ఏ ఫుడ్ నచ్చుతుందో చూద్దాం. బాలయ్య బాబు నచ్చిన ఫుడ్ తినడంలో ముందుంటారు. ఆయన స్నాక్ గా ఆమ్లెట్ ని తినడానికి ఇష్టపడతారట. అలాగే.. రొయ్యలు, చికెన్ బిర్యానీ అంటే ఆయనకు బాగా ఇష్టమట. అచ్చ తెలుగు భోజనాన్ని, గోంగూర పచ్చడిని బాగా ఇష్టంగా తింటారట.
Advertisement
ఇక ప్రభాస్ ఫుడ్ గురించి చెప్పక్కర్లేదు. రాజుల భోజనం అంటూ ప్రభాస్ తన వద్దకి వచ్చిన వారందరికీ కడుపునిండా పెట్టేస్తూ ఉంటారు. షూటింగ్ ఏదైనా ఆయన తినే భోజనమే టీం అంతా పెడతారట. సి ఫుడ్, నాటు కోడి, మటన్ ను ప్రభాస్ ఇష్టంగా తింటారట. ఇంకా పానీ పూరి అంటే కూడా ప్రభాస్ కు బాగా ఇష్టమట. యాభై ఏళ్లకు దగ్గరగా ఉన్నా, మహేష్ బాబు ఇంకా ఫిట్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకీ బిర్యానీ, చేపల పులుసు అంటే చాలా ఇష్టమట. పాలు, పెరుగు లాంటివి పెద్దగా తినరట.. కానీ తినేవి ఏమైనా మితంగా తింటారట. ఇక పవన్ కళ్యాణ్ కు నెల్లూరి చేపల పులుసు ఇష్టమట. ఇక వెజ్ లో పప్పు, అరటి వేపుడు ఇష్టమట. ఇక రామ్ చరణ్ కు ఆయన నానమ్మ చేతి వంట ఇష్టమట. ఆవిడ చేసే నాన్ వెజ్ కూరలని ఇష్టంగా తింటారట. ఇక అల్లు అర్జున్ కి కూడా ఇంటి భోజనమే ఇష్టమట. హైదరాబాద్ బిర్యానీని కూడా ఇష్టంగా తింటారట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కూడా బిర్యానీ అంటే ప్రాణం. నాటు కోడిని ఇష్టంగా తింటారట. అలాగే తారక్ మంచి కుక్ కూడా. ఖాళీ టైం లో బిర్యానీ ని బాగా కుక్ చేస్తారట. ఇంకా, నాగ చైతన్య కూడా మంచి ఫుడీ అట. ముద్ద పప్పు, నెయ్యి వేసుకుని ఇష్టంగా తింటారట. పచ్చిపులుసు ఆయనకి ఇంకా ఇష్టమైన ఫుడ్ అట. మటన్, రొయ్యల ఫుడ్ కూడా ఇష్టంగా తింటారట.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!