టాలీవుడ్ అగ్రదర్శకుల్లో ఒకరైన సుకుమార్ ఓ అడుగు ముందుకేసీ ఈసారి ఏకంగా అల్లుఅర్జున్ హీరోగా తెరకెక్కిస్తున్న సినిమా పుష్పను పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలోని ఊ అంటా మావ ఉఊ అంటావా మావ అనే ప్రత్యేక గీతం తాజాగా విడుదలైంది. ఈ గీతానికి స్టార్ హీరోయిన్ సమంత కాలు కదిపి సినీప్రియుల చూపులను తనవైపు తిప్పుకున్నది. ఈ సాంగ్ ప్రస్తుతం కుర్రకారులను విపరీతంగా ఊపేస్తున్నది. ఎక్కడ చూసిన ఇదే వినిపిస్తోంది. సోషల్‌మీడియాలోనూ ఈ పాట మామూలుగా ట్రెండింగ్ అవ్వడం లేదు.
Advertisement
Ad
అయితే సమంత కంటే ముందే పలువురు ప్రముఖ కథానాయికలు కూడా ప్రత్యేక గీతంలో ఆడిపాడి అభిమానులను ఎంతగానో అలరించారు. గతంలో ఐటెమ్ సాంగ్స్ కోసం కొంతమంది ప్రత్యేకంగా ఆర్టిస్ట్‌లు కూడా ఉండేవారు. సిల్క్‌స్మిత, జయమాలిని సహా పలువురు అలనాటి తారలు ఈ ప్రత్యేక గీతాల్లో చిందులేసేవారు. ఆ తరువాత ముమైత్ ఖాన్ సహా ఇంకొంతమంది వరకు కొద్ది కాలం పాటు ఈ ట్రెండ్ కొనసాగింది. అనంతరం తమ ఫేమ్ తగ్గిన తర్వాత రాశీ, రంభలాంటి వారు స్పెషల్ సాంగ్స్ చేసారు. కానీ ఆ తరువాత క్రమక్రమంగా రూట్ మారిపోయింది.
Advertisement
ముఖ్యంగా ఫామ్‌లో ఉన్నప్పుడే స్టార్ హీరోయిన్లు ఇలాంటివి చేసేందుకు ఆసక్తి చూపడం మొదలుపెట్టారు. బాలీవుడ్లో కరీనాకపూర్, కత్రినా కైఫ్ లాంటి టాప్ హీరోయిన్స్‌తో మొదలైన ఈ కొత్త ట్రెండ్ టాలీవుడ్‌లోనూ కొనసాగింది. శ్రియ, తమన్నా, శ్రుతిహాసన్, కాజల్ ఇలా పలువురు భామలు తమ అందాలను ఆరబోస్తూ ఐటెం సాంగ్స్‌లో కనపడి సినీ ప్రియులను కట్టిపడేసారు. హీరోయిన్గా ఫామ్‌లో ఉండగానే స్పెషల్ సాంగ్స్‌లో చిందులేసే ట్రెండ్ శ్రియతోనే మొదలైందని చెప్పొచ్చు. రామ్ హీరోగా నటించిన దేవదాసు చిత్రంలో జామ్ జికిడి పాటతో అలరించిందీ ఈ భామ. ఈ సాంగ్ అప్పట్లో కుర్రోళ్లను ఉర్రూతలూగించింది. ఆ తరువాత ‘మున్నా’, ‘తులసి’, ‘పులి’ సహా పలు చిత్రాల్లో చేసింది శ్రియా. ఈ మధ్య కాలంలో తమన్నా, పూజాహెగ్దే, సమంత లాంటి కథానాయికలు ఈ సాంగ్‌లలో నటించి మాస్ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.