ప్రస్తుతం తెలుగు సినిమాల స్థాయి పెరిగింది. ముఖ్యంగా బాహుబలి, పుష్ప సినిమాలు పాన్ఇండియా మూవీస్ కావడంతో తెలుగు సినిమా రేంజ్ మరింత పెరిగింది. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లేవల్‌లో తెరకెక్కించారు.
అన్ని భాషల్లో ఆయా సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. కలెక్షన్లు కూడా భారీగానే సాధిస్తున్నాయి. ఈ తరుణంలో హీరోల రెమ్యునరేషన్‌తో పాటు దర్శకుల రెమ్యునరేషన్ కూడా పెరుగుతుంది. ఇక ప్రస్తుతం అందరి చూపు అగ్ర దర్శకుల పైనే ఉంది. వారు రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారనే ఆసక్తిని కలిగిస్తోంది. కొందరూ రెమ్యునరేషన్ కాకుండా సినిమా బిజినెస్‌లో వాటాలు కూడా తీసుకుంటున్నారట. టాలీవుడ్ అగ్రదర్శకులు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ఎస్.ఎస్.రాజమౌళి
బాహుబలి సినిమాతో టాలీవుడ్ స్థాయిని పెంచాడు. నెంబర్ వన్ దర్శకుడు అని చెప్పవచ్చు. రాజమౌళి ఎక్కువగా పెద్ద బడ్జెట్ సినిమాలు తీస్తుంటారు. రెమ్యునరేషన్ లా కాకుండా బిజినెస్‌లో వాటాలు తీసుకుంటూ వస్తున్నారు. ఆర్ఆర్ఆర్ షేర్స్ ద్వారానే డీలింగ్స్ సెట్ చేసుకున్నట్టు సమాచారం. సినిమా బిజినెస్‌ను బట్టి ఆ సినిమాకు రూ.100 కోట్లు తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.
సుకుమార్
రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా నుంచి సుకుమార్ తన రేటును పెంచేశాడు. ఒక్కో సినిమాకు ప్రస్తుతం 20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. బన్నీతో చేస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప పార్ట్ 2కు రూ.23 కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
త్రివిక్రమ్
టాలీవుడ్ అగ్రదర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా రాజమౌళి తరహాలోనే వెళ్లుతున్నారు. అల.. వైకుంఠపురం హిట్ తరువాత రెమ్యునరేషన్ భారీగానే పెరిగింది. ఒక్కో సినిమాకు రూ.20 కోట్లతో పాటు బిజినెస్‌లో వాటా కూడా తీసుకుంటున్నారు త్రివిక్రమ్.
Advertisement
కొరటాల శివ
మినిమమ్ పెట్టిన పెట్టుబడికి ప్రాఫిట్స్ డబుల్ వచ్చేవిధంగా చేయడంలో కొరటాల శివ సిద్ధహస్తుడు. రిస్క్ లేకుండా సినిమాను సేఫ్ జోన్‌లో ఉంచుతాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న ఆచార్య సినిమాకు 20 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్టు సమాచారం. అంతకు ముందు రూ.13 కోట్లు తీసుకున్న కొరటాల ఆచార్యతో రెమ్యునరేషన్ పెంచినట్టు సమాచారం.
బోయపాటి శ్రీను
బోయపాటి శ్రీను వినయ విధేయ రామ వరకు మంచి ఫామ్‌లో ఉన్నాడు. అప్పటి వరకు దాదాపు 10 కోట్ల వరకు తీసుకున్నాడు. ఆ తరువాత వరుసగా డిజాస్టర్స్ కావడంతో రెమ్యునరేషన్ తగ్గించాడట. ఇక ఇటీవల బాలయ్యతో తీసిన అఖండ ఘన విజయం సాధించడంతో మళ్లీ రెమ్యునరేషన్ పెరిగింది. 10 నుంచి రూ.12 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట బోయపాటి.
పూరి జగన్నాథ్
మాస్ కు మారుపేరు పూరిజగన్నాథ్. ఆయన ఇప్పుడు సొంత బ్యానర్‌లోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నాడు. ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.
శేఖర్ కమ్ముల
శేఖర్ కమ్ముల కూడా ప్రస్తుతం టాప్ రెమ్యనరేషన్ అందుకుంటున్న దర్శకుల్లో ఒకరు. ఫిదా సినిమా బాక్సాపీస్ వద్ద మంచి లాభాలనే తెచ్చిపెట్టింది. ఇక లవ్‌స్టోరీ సినిమాకు రూ.10కోట్లు తీసుకున్నారు. ధనుష్‌తో తీయబోయే సినిమాలో అంతకంటే ఎక్కువగానే తీసుకోవచ్చని సమాచారం.
అనీల్ రావిపూడి
వరుస బాక్సాఫీస్ హిట్స్‌తో దూసుకుపోతున్న యువదర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్2 సినిమాతో తన మార్కెట్ ను మరింత పెంచుకున్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమాకు రూ. 9 కోట్లు తీసుకున్న అనీల్ ప్రస్తుతం ఎఫ్3 కోసం రూ.10 కోట్లు తీసుకున్నట్టు సమాచారం.
Also Read : Radhe Shyam: ప్రభాస్ సినిమా ఫస్ట్ రివ్యూ.. ఎలా ఉందంటే..?