సినిమా తారలు పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయింది. కేవలం పెళ్లి తర్వాత మాత్రమే కాకుండా కొంతమంది ఎంగేజ్మెంట్ తర్వాత కూడా విడిపోయారు. చిత్ర పరిశ్రమలో అలా విడిపోయిన జంటలు చాలానే ఉన్నాయి. అలా పెళ్లి తర్వాత విడిపోయిన జంటలు ఏవో ఇప్పుడు చూద్దాం….
Advertisement
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న త్రిష కు వరుణ్ మణియన్ అనే వ్యాపారవేత్తతో 2015లో ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ ఆ తర్వాత పెళ్లి చేసుకోకుండానే ఈ జంట విడిపోయింది.
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కు అనిషా ఆల్లరెడ్డి తో ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ ఆరు నెలల తర్వాత ఈ జంట విడిపోయింది.
Advertisement
టాలీవుడ్ హీరోయిన్ మెహరిన్ ఎంగేజ్ మెంట్ యువ నేత భవ్య బిస్బొయ్ తో గతేడాది జరిగింది. ఈ జంట కూడా పెళ్లి కాకుండానే విడిపోయింది.
ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రష్మిక మందన గతంలో లో కన్నడ హీరో రక్షిత్ శెట్టి తో ప్రేమలో మునిగి తేలింది. వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ ఎంగేజ్మెంట్ తర్వాత టాలీవుడ్ లో వరుస ఆఫర్ లు రావడంతో రష్మిక రక్షిత్ శెట్టికి బ్రేకప్ చెప్పింది. ఇక ప్రస్తుతం రష్మిక విజయ్ దేవరకొండ తో డేటింగ్ లో ఉన్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.
నాగార్జున చిన్న కొడుకు అఖిల్ అక్కినేనికి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే తన ప్రియురాలు శ్రియా భూపాల్ తో ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ వీరిద్దరు కూడా పెళ్ళి కాకుండానే విడిపోయారు.