Home » టాలీవుడ్ లో గొప్ప మనసున్న 6గురు స్టార్లు…వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంటో తెలుసా..!

టాలీవుడ్ లో గొప్ప మనసున్న 6గురు స్టార్లు…వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంటో తెలుసా..!

by AJAY
Ad

సినిమా హీరోలు హీరోయిన్లను ప్రేక్షకులు ఆదర్శంగా తీసుకుంటారు. తమకు నచ్చిన హీరోలు హీరోయిన్లు ఎలా ఉంటే తాము కూడా అలాగే ఉండాలని అభిమానులు కోరుకుంటారు. కాబట్టి టాలీవుడ్ లో కొంతమంది సెలబ్రిటీలు సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు చేస్తు ఫ్యాన్స్ కి ఆదర్శంగా నిలుస్తున్నారు. అలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం…

Sonu Sood

Sonu Sood

సోను సూద్ సినిమాల్లో విలన్ పాత్రలు చేస్తూ నిజజీవితంలో రియల్ హీరో అనిపించుకున్నాడు. లాక్ డౌన్ లో సోనూ సూద్ చేసిన సేవా కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికీ సోనుసూద్ తన సేవా కార్యక్రమాలను దేశవ్యాప్తంగా కొనసాగిస్తున్నాడు.

Advertisement

chiranjeevi

chiranjeevi

చిరంజీవి సైతం ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా గొప్ప మనసు చాటుకుంటున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్… చిరంజీవి ఐ బ్యాంక్ ల ద్వారా ఎంతో మందికి రక్త దానం, నేత్ర దానం చేస్తూ సాయపడుతున్నారు.

Advertisement

నటసింహం నందమూరి బాలకృష్ణ కోపాన్ని మాత్రమే చూస్తూ ఉంటాం. కానీ ఆఫ్ స్క్రీన్ లో బాలయ్య బాబు అంత మంచివాళ్ళు ఉండరు. తక్కువ ఖర్చుతో అంతర్జాతీయస్థాయిలో బాలయ్య బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా వైద్యం అందిస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయిస్తూ తెలుగు ప్రజల హృదయాన్ని దోచుకున్నాడు. వందల మంది చిన్నారుల ప్రాణాలను మహేష్ బాబు కాపాడారు.

టాలీవుడ్ అందాల తార సమంత… ప్రత్యూష అనే ఫౌండేషన్ ను స్థాపించి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తన చారిటీ ద్వారా సమంత చిన్నారులకు అన్నిరకాల సేవా కార్యక్రమాలు చేస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సేవ విషయం లో ముందు ఉంటారు. ఎలాంటి తుఫాన్, కరువు ఇలా ఏ ప్రకృతి విపత్తు వచ్చిన పెద్ద మొత్తంలో సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Visitors Are Also Reading